iDreamPost
android-app
ios-app

లియో మూవీ కోసం నటుడిగా మారుతున్న స్టార్ డైరెక్టర్!

  • Published Jul 05, 2023 | 7:14 PM Updated Updated Jul 05, 2023 | 7:14 PM
  • Published Jul 05, 2023 | 7:14 PMUpdated Jul 05, 2023 | 7:14 PM
లియో మూవీ కోసం నటుడిగా మారుతున్న స్టార్ డైరెక్టర్!

ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ఒక్కో క్రేజీ అప్డేట్స్ తో తమ సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్.. ఇప్పుడు దళపతి విజయ్ తో ‘లియో’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో అంచనాలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. ఆల్రెడీ లోకేష్ కనగరాజ్.. ఈ లియో మూవీని తను క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ లో భాగం చేస్తున్నాడని తెలిసిందే. మొత్తానికి మాస్టర్ తో హిట్ కొట్టాక.. విజయ్ ని కూడా తన యూనివర్స్ లోకి తీసుకొచ్చేశాడు.

ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ కూడా అక్టోబర్ 19 గా ప్రకటించేశారు మేకర్స్. అయితే.. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ మీనన్, డైరెక్టర్ మిస్కిన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అసలు లోకేష్ యూనివర్స్ లో.. ఇదివరకే కార్తీ, సూర్య, కమల్ హాసన్, ఫాహద్ ఫాజిల్, ఏజెంట్ టీనా లాంటి క్యారెక్టర్స్ చాలా చూశాం. వీరంతా ఉన్న దాంట్లో అసలు సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, త్రిష, మిస్కిన్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో అని అందరు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో లియోలోకి ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తోంది.

అదికూడా బాలీవుడ్ లో పాపులర్ అయిన ఓ డైరెక్టర్ లియోలో నటించనున్నాడట. అవును.. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కాంట్రవర్సీ డైరెక్టర్ అనురాగ్ కష్యప్. అదేంటీ ఆల్రెడీ సినిమాలో డైరెక్టర్స్ గౌతమ్ మీనన్, మిస్కిన్ ఉన్నారుగా అనిపించవచ్చు. కానీ.. మాస్టర్ మైండ్ లోకేష్ ప్లాన్ ఎలా ఉందో ఎవరికి తెలియడం లేదు. మరి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంటున్నారు.. లోకేష్ వీళ్లందరినీ ఎలా చూపిస్తాడు? అని చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఖైదీ, విక్రమ్ సినిమాలతో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న లోకేష్.. ఈసారి బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేస్తాడో చూడాలి. ఇక ఇప్పటికైతే అనురాగ్ కష్యప్ క్యారెక్టర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. మరి లియో మూవీపై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş