టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలోనే ఓ కొత్త ఓటీటీని ప్రారంభించబోతున్నరని సమాచారం. సరికొత్త ప్లాన్ ప్రకారమే దిల్ రాజు.. ఈ ఓటీటీని తీసుకురాబోతున్నాడట.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలోనే ఓ కొత్త ఓటీటీని ప్రారంభించబోతున్నరని సమాచారం. సరికొత్త ప్లాన్ ప్రకారమే దిల్ రాజు.. ఈ ఓటీటీని తీసుకురాబోతున్నాడట.
కరోనా మహమ్మారి తర్వాత ఓటీటీలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో పుట్టగొడుగుల్లా ఓటీటీలు పుట్టుకొచ్చాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే విజయవంతగా నడుస్తున్నాయి. తాజాగా మరో కొత్త ఓటీటీ రాబోతుందన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలోనే ఓ కొత్త ఓటీటీని ప్రారంభించబోతున్నరని సమాచారం. సరికొత్త ప్లాన్ ప్రకారమే దిల్ రాజు.. ఈ ఓటీటీని తీసుకురాబోతున్నాడట. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. త్వరలోనే కొత్త ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి కంటెంట్ క్రియేషన్ మీద ఆయన దృష్టిపెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల వినికిడి. ఇన్ని డబ్బులు అని బడ్జెట్ పెట్టి దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడట దిల్ రాజు. దీనికోసం ఆయన మరికొందరు నిర్మాతలతో చేయి కలుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. స్వయంగా అతనే భాగస్వాములతో కలిసి సినిమాలు నిర్మించి.. థియేటర్ రిలీజ్ తర్వాత డైరెక్ట్ గా తమ సొంత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చనే భారీ ప్లాన్ తో దిల్ రాజు ఉన్నట్లు సమాచారం.
కాగా.. ఇప్పటికే అల్లు అరవింద్ ‘ఆహా’ అనే ఓటీటీని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు మరో నిర్మాత ఓటీటీ రంగంలోకి రావడంతో.. పోటీ తీవ్రమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా.. ఓటీటీ అంటే నిరంతరం కొత్త కంటెంట్ స్ట్రీమింగ్ అవుతూ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు సదరు సంస్థకు సబ్ స్క్రైబర్స్ గా మారుతారు. అయితే దిల్ రాజు ప్రతీది ప్లానింగ్ తో చేస్తాడు అనే ముద్ర ఇండస్ట్రీలో ఉంది. మరి ఓటీటీ రంగంలోకి దిల్ రాజు ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.