iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో దిల్ రాజు కి కోపం వచ్చింది!

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ లో ఎంతో సౌమ్యంగా.. తన పరిధి మేరకే మాట్లాడుతూ.. ఎంతో కూల్ గా కనిపిస్తుంటారు.

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ లో ఎంతో సౌమ్యంగా.. తన పరిధి మేరకే మాట్లాడుతూ.. ఎంతో కూల్ గా కనిపిస్తుంటారు.

ఆ విషయంలో దిల్ రాజు కి కోపం వచ్చింది!

అజాత శత్రువే అలగిననాడు, సాగరములన్ని పొంగిపోవునే అన్న కురుక్షేత్రం నాటకంలో పద్యం గుర్తొచ్చే సందర్భం ఇది.  ఈ డైలాగ్ పూర్తిగా దిల్ రాజుకి వర్తిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ, ఎటువంటి పరిస్థితులలోనూ కోపాన్ని ప్రదర్శించకుండా, ఎంతో సంయమనంతో, అందరితోనూ ఆహ్లాదంగా మసలే దిల్ రాజు పట్టరాని ఆగ్రహానికి గురయ్యారు.  ఆయనమీద ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తుంటుంది. కాయలున్న చెట్టుకే రాళ్ళు అన్నట్టుగా ఆయనకున్న టాప్ రేంజ్ కి ఏదో ఒక రాయి ఎప్పుడూ దిల్ రాజును టార్గెట్ చేస్తూనే ఉంటుంది. ధియేటర్లు అన్నీ లాగేశాడని, మిగతా సినిమాలకి మొండి చేయి చూపించాడని, చూపిస్తున్నాడని, ఇండస్ట్రీ మొత్తం తనదేనన్నట్టుగా ప్రవర్తిస్తాడని, అన్ని విషయాల్లో హై హేండ్ చేస్తాడని….ఒకటి రెండు కాదు. పుంఖానుపుంఖాలుగా తెల్లవారే సరికి దిల్ రాజు ఇంటిముందు గుట్టలు గుట్టలుగా తిట్లు, శాపనార్ధాలు పోగు పోసి ఉంటాయి.

వాటన్నిటినీ చాలా ఓపిగ్గా, గొప్ప కంట్రోల్డ్ గా హేండిల్ చేసి, ఎవరినీ నొప్పించకుండా, అలాగని తప్పించుకుని తిరగకుండా, అందరికీ తలలో నాలుకలా మెసిలే దిల్ రాజు   ఒక్కసారిగా కోపాన్ని ప్రదర్శించారు. ‘దిల్ రాజుని ఏమన్నా ఏమీ అనడులే…సర్దుకుపోతాడు అని అనుకుంటే పొరబాటు. తాట తీస్తా…ఇష్టం వచ్చినట్టు రాస్తే. కొన్ని వెబ్ సైట్లు ప్రతీదాన్ని వక్రీకరించి రాసి ఏదో లబ్ది పొందుదామని అనుకుంటే మాత్రం ఇకపైన ఊరుకోను. అరె…ఏ విషయమైనా సరే, దానికి నన్ను ముడిపెట్టి, మెలికేసి నాకు అంటగట్టి రాస్తున్నారు. ముఖ్యంగా పండగ రిలీజులనగానే ఇంక నేనే మెయిన్ టార్గెట్. ఇకపైన మాత్రం ఊరుకోను’ అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

dil raju angry

అసలు సంగతేంటంటే….పండక్కి రిలీజయ్యే సినిమాలలో గుంటూరు కారం సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాదాపు 90 సింగిల్ స్క్రీన్లలో గుంటూరు కారం సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. అందువల్ల హనుమాన్ సినిమాకి సింగిల్ స్క్రీన్లు నామమాత్రంగా మాత్రమే లభించాయని, ఇది కేవలం దిల్ రాజు మేనిప్యులేషన్ కారణంగానే జరిగిందని సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. కానీ వాస్తవానికి, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు ఎంతో టైం వెచ్చింది అందరినీ సంప్రదించి పండగ రిలీజులను సాధ్యమైనంత స్థాయిలో చక్కబరిచారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్ ఐ డ్రీమ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో స్పష్టం చేశారు కూడా.   ప్రాపర్ రిలీజుల కోసం దిల్ రాజు చాలా కష్టపడ్డారని టిజి చాలా తేటతెల్లంగా చెప్పారు. కానీ, దిల్ రాజు పడే శ్రమ, ప్రయాసని గుర్తించకపోగా, లేనిపోని నిందలు వేశారనే పాయంట్లో దిల్ రాజు తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆగ్రహంలో న్యాయం ఉందిగా మరి.