iDreamPost
android-app
ios-app

దిల్ రాజు ఇంట మోగనున్న పెళ్లిబాజాలు.. ప్రముఖ వ్యాపారవేత్తతో వియ్యం!

  • Author ajaykrishna Published - 06:49 PM, Sat - 28 October 23

టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠీల పెళ్లి జరగబోతుంది. రీసెంట్ గా హీరో వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు ఇదే వరుసలో దిల్ రాజు ఫ్యామిలీ కూడా చేరబోతుందట.

టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠీల పెళ్లి జరగబోతుంది. రీసెంట్ గా హీరో వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు ఇదే వరుసలో దిల్ రాజు ఫ్యామిలీ కూడా చేరబోతుందట.

  • Author ajaykrishna Published - 06:49 PM, Sat - 28 October 23
దిల్ రాజు ఇంట మోగనున్న పెళ్లిబాజాలు.. ప్రముఖ వ్యాపారవేత్తతో వియ్యం!

టాలీవుడ్ లో ప్రస్తుతం సెలబ్రిటీల పెళ్లిళ్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. హీరోలు, హీరోయిన్స్.. సెలబ్రిటీల పిల్లలు.. ఇలా ఒక్కొక్కరుగా పెళ్లి బాట పడుతున్నారు. ఒక రకంగా టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నవంబర్ 3న క్రేజీ పెయిర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీల పెళ్లి జరగబోతుంది. వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో జరగనుంది. అలాగే రీసెంట్ గా హీరో దగ్గుబాటి వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని ఎంగేజ్మెంట్ జరిగింది. మరోవైపు ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పుడు ఇదే వరుసలో స్టార్ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ కూడా చేరబోతుంది. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు, యంగ్ హీరో ఆశిష్ రెడ్డి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడట. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీతో దిల్ రాజు ఫ్యామిలీ వియ్యం అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఎంగేజ్మెంట్ జరిపించి.. వచ్చే ఏడాది వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14న) రోజు పెళ్లి చేసే ఆలోచన చేస్తున్నట్లు టాక్. అయితే.. ఈ పెళ్లి గురించి దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తుంది. ఇటీవల దిల్ రాజు తండ్రి చనిపోవడంతో.. శుభకార్యం చేస్తే మంచిదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట.

ఇదిలా ఉండగా.. ఆశిష్ రెడ్డి గతేడాది రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నాడు ఆశిష్. ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ తెరకెక్కిస్తున్నాడు. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. పెళ్లికి ముందే రిలీజ్ చేయనున్నారని సమాచారం. కాగా.. ఆశిష్ రెడ్డి ఓవైపు సినీ కెరీర్ చూసుకుంటూనే.. ఇటు పర్సనల్ లైఫ్ పరంగా సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట. మరి ఆశిష్ రెడ్డి పెళ్లి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişantikbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom