iDreamPost
android-app
ios-app

వీడియో: స్టేజ్ పై వైష్ణవి చైతన్యతో కలిసి దిల్ రాజు సాంగ్..!

  • Published Mar 30, 2024 | 7:04 PM Updated Updated Mar 30, 2024 | 7:04 PM

Dil Raju- Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య- ఆశిష్ జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు లవ్ మీ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి తొలి సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

Dil Raju- Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య- ఆశిష్ జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు లవ్ మీ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి తొలి సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

  • Published Mar 30, 2024 | 7:04 PMUpdated Mar 30, 2024 | 7:04 PM
వీడియో: స్టేజ్ పై వైష్ణవి చైతన్యతో కలిసి దిల్ రాజు సాంగ్..!

వైష్ణవి చైతన్య.. ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ‘బేబీ సినిమా’తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవి చైతన్యకు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. తన నటన, డాన్స్ తో ప్రేక్షకుల అభిమానం, ఆదరణ సొంతం చేసుకుంది. టాలెంట్ ఉంటే ఎలాగైన అవకాశాలు వస్తాయి అని నిరూపించుకుంది. అవకాశం వచ్చినప్పుడు మన టాలెంట్ నిరూపించుకుంటే ఇండస్ట్రీలో తిరుగుండదు అని కూడా నిరూపించుంకుంది. ఇప్పుడు హీరోయిన్ వైష్ణవి చైతన్య తనలో ఉన్న మరో టాలెంట్ ని బయటపెట్టింది. దిల్ రాజుతో కలిసి గొంతు కలిపింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వైష్ణవి చైతన్య బేబీ సినిమా తర్వాత మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ‘లవ్ మీ’ సినిమాలో నటిస్తోంది. ఆమె సరసన ఆశిష్ హీరోగా చేస్తున్నాడు. ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ లవ్ స్టోరీని అరుణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. పోస్టర్- ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ‘రావాలి రా’ అనే సాంగ్ ని గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు సహా వైష్ణవి చైతన్య, ఆశిష్ పాల్గొన్నారు. రావాలి రా అంటూ ఒక మంచి మెలోడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Dil raju

ఈ రావాలి రా.. పాటకి అకాడమీ అవార్డు విన్నర్స్ కలిసి పని చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిచగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఈ పాటని మొత్తం ఏడుగురు సింగర్స్ పాడారు. వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు. ఈ మూవీ ద్వారా వైష్ణవి చైతన్యలో ఉన్న మరో టాలెంట్ ఆడియన్స్ కి తెలిసినట్లు అయ్యింది. సాంగ్ లాంఛ్ సందర్భంగా స్టేజ్ మీద దిల్ రాజు మొదట ఈ సాంగ్ ని అందుకున్నారు. రావాలి రా అంటూ హమ్ చేశారు. ఆ తర్వాత వైష్ణవితో ఈ సాంగ్ ని పాడించారు. స్టార్ట్ చేసి ఆపేయగానే పాడాల్సిందే అంటూ పాట పాడించారు. అలాగే వైష్ణవి చాలా బాగా పాడుతుంది అంటూ దిల్ రాజు సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. సాంగ్ విన్న తర్వాత ఆడియన్స్ కూడా అదే మాట అంటున్నారు.

వైష్ణవి ఎంతో బాగా డాన్స్ చేస్తుంది అనుకున్నాం.. సాంగ్స్ కూడా ఎంతో బాగా పాడుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక దిల్ రాజు కూడా గొప్ప సింగర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన జోష్ సినిమాలో ‘అన్నయోచ్చినాడు’ సాంగ్ పాడారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇలా స్టేజ్ మీద హమ్ చేశారు. ప్రస్తుతం ఈ సింగింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈమె చిన్న పార్ట్ మాత్రమే పాడింది. కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం పూర్తి పాట లైవ్ లో పాడుతుందని దిల్ రాజు తెలిపారు. మరి.. వైష్ణవి చైతన్య సింగింగ్ టాలెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş