iDreamPost
android-app
ios-app

నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న దిల్ రాజ్

  • Published Feb 03, 2024 | 8:00 PM Updated Updated Feb 03, 2024 | 8:00 PM

టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు గతకొంత కాలంగా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు సమాచారం అందింది.

టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు గతకొంత కాలంగా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు సమాచారం అందింది.

  • Published Feb 03, 2024 | 8:00 PMUpdated Feb 03, 2024 | 8:00 PM
నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న దిల్ రాజ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలు వచ్చి, అధికారం చేపట్టిన నేపథ్యంలో.. పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం పై దృష్టి పెట్టింది. అలాగే రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎక్కువ సీట్లు దక్కించుకునే లక్ష్యంతో కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తోంది. పైగా అటు ఎంపీ టికెట్ కోసం కూడా నేతల మధ్య ఫుల్ కాంపిటేషన్ ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి చాలమంది కాంగ్రెస్ నేతలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నట్లు సమాచారం అందింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు గతకొంత కాలంగా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు. ఈయనకు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీతో మంచి సత్ససంబంధాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఏ పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే దానిపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. దిల్ రాజ్ కాంగ్రెస్‌ నుంచే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాత మండలి ఎన్నికల సమయంలో.. తాను ఎంపీగా పోటీ చేస్తానని ఇదివరకే హింట్ ఇచ్చిన సంగతీ తెలిసిందే. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దిల్ రాజ్ తన సొంత జిల్లా అయిన నిజామాబాద్ నుంచి ఎంపీ గా పోటి చేయడానికి బరిలో దిగుతున్నరని సమాచారం. ఇప్పటికే మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ పేరుతో తన స్వగ్రామం నర్సింగ్ పల్లితో పాటు నిజామాబాద్ పరిసరా ప్రాంతాల్లో దిల్‌రాజు ఫ్యామిలీ పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో దిల్ రాజును పోటీలో ఉంచాలని హస్తం పార్టీ భావించినా.. అందుకు ఆయన ఒప్పుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోనే ఉండటంతో దిల్‌ రాజు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా ఇండస్ట్రీలో నిర్మాతగా ఉన్న దిల్ రాజ్ కు అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గుంటురు కారం సినిమా సమయంలో ఆయన చూట్టు మరింత కాంట్రవర్సి పేరిగిపోయింది. మళ్లీ ఇప్పుడు దిల్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ పై మరి ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వీటన్నీటిని స్ట్రాంగ్‌‌గా ఎదుర్కొంటూ.. రాజకీయాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి, త్వరలో దిల్ రాజ్ నిజామబాద్ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.