iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? పాలిటిక్స్‌లో ఒక సెన్సేషన్

  • Published May 12, 2024 | 6:01 PM Updated Updated May 12, 2024 | 6:01 PM

సెలబ్రిటీలకు సంబంధించి చిన్ననాటి ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు చూస్తే భలే అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ కైతే భలే ముచ్చటగా ఉంటుంది. తాజాగా ఈ చిన్నారి ఫోటో కూడా వైరల్ అవుతోంది. మరి ఆమెను గుర్తుపట్టారా?

సెలబ్రిటీలకు సంబంధించి చిన్ననాటి ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు చూస్తే భలే అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ కైతే భలే ముచ్చటగా ఉంటుంది. తాజాగా ఈ చిన్నారి ఫోటో కూడా వైరల్ అవుతోంది. మరి ఆమెను గుర్తుపట్టారా?

  • Published May 12, 2024 | 6:01 PMUpdated May 12, 2024 | 6:01 PM
ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? పాలిటిక్స్‌లో ఒక సెన్సేషన్

సెలబ్రిటీలకు సంబంధించి చైల్డ్ హూడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ సెలబ్రిటీకి సంబంధించి ఈ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. పై ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? బుల్లి ప్యాంటు, బుల్లి టీషర్టు వేసుకుని మగరాయుడిలా ఫోజు కొడుతున్న ఆమె ఇప్పుడు ఒక యాంకర్. అలానే నటి కూడా. గ్లామర్ షోతో ఒకపక్క అనసూయ, రష్మీ లాంటి యాంకర్స్ దూసుకుపోతుంటే ఈమె మాత్రం పధ్ధతిగానే యాంకరింగ్ చేస్తూ వచ్చింది. అచ్చమైన తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. ఇప్పటికీ అదే ముద్రను కొనసాగిస్తుంది. 

మొదట్లో సీరియల్స్ లో నటించిన ఈమె.. ఆ తర్వాత వంటల ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా చేసింది. ఆ తర్వాత మూవీ ఈవెంట్స్ కి యాంకరింగ్.. ఆ తర్వాత పలు టీవీ రియాలిటీ షోస్ కి హోస్ట్ గా చేసింది. బుల్లితెర మీదనే కాకుండా వెండితెర మీద కూడా నటనతో ఆకట్టుకుంది. ఈమె కాకినాడలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన ఈమె.. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది ఇంటర్ వరకూ చదువుకున్న శ్యామల చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. పెళ్లి అయ్యాక డిగ్రీలో బీకామ్ పూర్తి చేసింది. పదో తరగతి చదువుతున్న రోజుల్లో సీరియల్ హీరోని ప్రేమించింది. 16 ఏళ్ల వయసులో పాలకొల్లులో ఓ సీరియల్ షూటింగ్ కి వెళ్ళింది. ఆ సమయంలో ఆడిషన్ లో కూడా పాల్గొంది. కానీ సెలెక్ట్ కాలేదు.

ఇంటర్ లో ఉండగా సీరియల్స్ లో నటిస్తా అని ఇంట్లో చెప్పడంతో ఆమెను హైదరాబాద్ పంపించారు. అవకాశాల కోసం చాలా ఆడిషన్స్ ఇచ్చింది. చాలా కష్టాలు పడింది. చివరకు లయ అనే సీరియల్ లో నటించే అవకాశం దక్కింది. ఆ సీరియల్ తో ఆమెకు పేరొచ్చింది. ఆ తర్వాత అవకాశాలు రావడం మొదలయ్యాయి. విచిత్రంగా ఏ వ్యక్తినైతే పదో తరగతిలో చూసి మనసు పారేసుకుందో ఆ వ్యక్తికి జోడిగా ఒక సీరియల్ లో నటించే అవకాశం పట్టేసింది. జగదేకవీరుడు అతిలోక సుందరి సీరియల్ 250 ఎపిసోడ్స్ పూర్తి చేసిన తర్వాత తన ప్రేమ విషయం ఆ సీరియల్ నటుడికి చెప్పింది. ఆమె ప్రేమను అతను అంగీకరించడం.. పెళ్లి అయిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

ప్రస్తుతం ఆమె పాలిటిక్స్ లో లేడీ సెన్సేషన్ గా ఉంది. ఆమె మరెవరో కాదు యాంకర్ శ్యామల. తనదైన యాంకరింగ్ తో బుల్లితెర మీద సందడి చేసిన శ్యామల.. ఆ తర్వాత సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంది. లౌక్యం, ఒక లైలా కోసం, మాచర్ల నియోజకవర్గం, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించింది. బిగ్ బాస్ సీజన్ 2లో కూడా పాల్గొంది. వైసీపీ తరపున ప్రచారం చేస్తుంది. పిఠాపురంలో తన స్నేహితురాలైన వంగా గీతకు మద్దతుగా ప్రచారం చేస్తుంది. రీసెంట్ గా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మీద సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. గత ఎన్నికల సమయంలోనే యాంకర్ శ్యామల వైసీపీలో చేరింది. తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఆమె మరోసారి తెరపైకి వచ్చింది.  

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio