iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? ప్రముఖ యాంకర్ భర్త, సింగర్

  • Published Jun 12, 2024 | 9:49 PM Updated Updated Jun 12, 2024 | 9:49 PM

Did You Recognize: ఈ ఫోటోలో ఉన్న తల్లిచెంతన ఉన్న ఈ బాబుని గుర్తుపట్టారా? అప్పట్లో బీటెక్ స్టూడెంట్స్ అందరినీ తన పాటతో ఉర్రూతలూగించిన సింగర్. ప్రముఖ యాంకర్ భర్త కూడా. గుర్తుపట్టారా?

Did You Recognize: ఈ ఫోటోలో ఉన్న తల్లిచెంతన ఉన్న ఈ బాబుని గుర్తుపట్టారా? అప్పట్లో బీటెక్ స్టూడెంట్స్ అందరినీ తన పాటతో ఉర్రూతలూగించిన సింగర్. ప్రముఖ యాంకర్ భర్త కూడా. గుర్తుపట్టారా?

  • Published Jun 12, 2024 | 9:49 PMUpdated Jun 12, 2024 | 9:49 PM
ఈ ఫోటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? ప్రముఖ యాంకర్ భర్త, సింగర్

సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రిటీలు బాల్యంలో తమ తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అవి సోషల్  మీడియాలో వైరల్ అవుతాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న బాబు ప్రముఖ యాంకర్ భర్త, టాలీవుడ్ స్టార్ సింగర్. తల్లి పక్కన నిలుచుని అమాయకంగా కనబడుతున్న ఈ కుర్రాడు పాట పాడితే ఎంత హాయిగా ఉంటుందో. మనసారా పాడతారు. నీలో నాలో ఆనందం కలిగిస్తారు. మనసారా, నీలో నాలో, ఆనందం, బన్నీ ఎన్ చెర్రీ వంటి అనేక సినిమాలకు పాటలు పాడారు. నువ్విలా ఒకసారిలా అనే సాంగ్ అప్పట్లో హిట్ అయ్యింది. ఈయన కెరీర్ ఆరంభంలో పలు సింగింగ్ షోస్ లో పాల్గొన్నారు.

స్వరాభిషేకం, ఢీ, క్యాష్ వంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత 2005లో టెన్త్ క్లాస్ అనే సినిమాకి పాట పాడారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యం వహించారు. ఫస్ట్ పాడిన పాట అదే. ఆ తర్వాత ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్ చదువుతుండగానే సింగింగ్ పోటీల్లో పాల్గొనేవారు. క్లాసెస్ కి కూడా వెళ్లకుండా పాటల పోటీల్లో పాల్గొనేవారు. ఇంజనీరింగ్ లో చేరిన తర్వాత శ్రీరామదాసు, ఛత్రపతి సినిమాలకి కీరవాణి దగ్గర కోరస్ పాడడం స్టార్ట్ చేశారు. ఇంజనీరింగ్ లో ఉండగానే హ్యాపీడేస్ మూవీలో జిల్ జిల్ జిగా అనే పాట పాడే అవకాశం ఇచ్చారు మిక్కీ జే మేయర్. ఆ పాటతో ఒక్కసారిగా కృష్ణ చైతన్యకు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది.

హ్యాపీడేస్ సినిమా అప్పట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి బాగా ఎక్కేసింది. ఇక జిల్ జిల్ జిగా పాట కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇంజనీరింగ్ అయిన తర్వాత మూడు నెలలు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత మ్యూజిక్ మీద ఆసక్తితో జాబ్ మానేసి ఫుల్ టైం సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఇక ఈయన 2013లో ప్రముఖ యాంకర్ ని వివాహం చేసుకున్నారు. ఆమె చాలా పద్ధతిగా యాంకరింగ్ చేస్తారు. అచ్చ తెలుగు అమ్మాయిలా చీర కట్టులో యాంకరింగ్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి పలు షోస్ లో కూడా పాల్గొన్నారు. వాళ్ళు మరెవరో కాదు సింగర్ కృష్ణ చైతన్య, యాంకర్ మృదుల. వీరు ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ ని నిర్వహిస్తున్నారు. అందులో డైలీ యాక్టివిటీస్ ని వీడియోస్ గా తీసి అప్లోడ్ చేస్తుంటారు. టాలీవుడ్ లో వీరి జంట బాగుంటుందని కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabetganobet