iDreamPost
android-app
ios-app

వింటేజ్ ఫోటో: హీరోయిన్ ఫీచర్స్ ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడో స్టార్ సింగర్

  • Published May 07, 2024 | 9:18 PM Updated Updated May 07, 2024 | 9:18 PM

వింటేజ్ ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఆమె ఇప్పుడో స్టార్ సింగర్. చిన్న వయసులోనే పాటల తోటలో ఊయల ఊగారు. ఆ తర్వాత తన గాత్రంతో యువతను ఉర్రూతలూగించారు.

వింటేజ్ ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఆమె ఇప్పుడో స్టార్ సింగర్. చిన్న వయసులోనే పాటల తోటలో ఊయల ఊగారు. ఆ తర్వాత తన గాత్రంతో యువతను ఉర్రూతలూగించారు.

  • Published May 07, 2024 | 9:18 PMUpdated May 07, 2024 | 9:18 PM
వింటేజ్ ఫోటో: హీరోయిన్ ఫీచర్స్ ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడో స్టార్ సింగర్

పై ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడో స్టార్ సింగర్. చూడ్డానికి హీరోయిన్ లా, కలర్స్ స్వాతిలా అనిపిస్తున్నారు కదూ. కానీ ఆమె హీరోయిన్ లా ఉన్న మాట నిజమే కానీ స్వాతి మాత్రం కాదు. ఆమె ఒక ప్రొఫెషనల్ సింగర్. ఆమె అప్పుడూ, ఇప్పుడూ హీరోయిన్ లా చాలా క్యూట్ గా ఉన్నారు. ఈమె విజయవాడ అమ్మాయి. 6వ ఏటనే సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అతి చిన్న వయసులోనే ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన పలు కార్యక్రమాలతో సహా అనేక సంగీత కచేరీలో పాల్గొన్నారు. 13వ ఏటప్పుడే త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్నారు. బాల మేధావిగా చిన్నతనంలోనే అనేక అవార్డులను గెలుచుకున్నారు. చిన్నతనంలోనే సక్సెస్ చూసిన ఆమె 17 ఏళ్లకే సినీ రంగ ప్రవేశం చేశారు.

సింగర్ గా ఆమె తొలి సినిమా గులాబీ. ఈ సినిమాలో ఒక పాట ఇప్పటికీ ఎవర్ గ్రీనే. ఆ పాట ఎప్పుడు విన్నా.. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. ఇదొక్కటే కాదు.. ఆమె పాడిన ఎన్నో పాటలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. హాయినిచ్చే ప్రేమ పాటలే కాకుండా.. మాంచి కిక్ ఇచ్చే మాస్ సాంగ్స్ కూడా పాడి యువతను ఉర్రూతలూగించారు. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లో కూడా పాటలు పాడారు. దగ్గర దగ్గర ఆమె 3 వేలకు పైగా పాటలు పాడారు.  

యాంకర్ గా, పలు మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా, జడ్జిగా కూడా వ్యవహరించారు. పలు ఛానల్స్ లో నిర్వహించిన దాదాపు 500 ప్రోగ్రామ్స్ లో ఆమె సింగర్ గా, యాంకర్ గా, హోస్ట్ గా, జడ్జిగా వ్యవహరించారు. సింగర్ గా ఎన్నో సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఎన్నో అవార్డులను సైతం గెలుచుకున్నారు. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె పని చేశారు. 750 సినిమాలకు పైగా వందకు పైగా హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. సౌందర్య, రాశి, సంఘవి, సిమ్రాన్, లయ, భూమిక, సోనాలి బింద్రే, నయనతార, అనుష్క, త్రిష వంటి సీనియర్ హీరోయిన్స్ కే కాకుండా.. లావణ్య త్రిపాఠి, రెజీనా వంటి యంగ్ హీరోయిన్స్ కి కూడా ఆమె డబ్బింగ్ చెప్పారు.

చిన్నతనంలోనే సక్సెస్, అవార్డులు.. ఎదిగిన తర్వాత కూడా ఇండస్ట్రీలో సక్సెస్, అనేక అవార్డులు.. ఇలా ఎంతో సక్సెస్ చూసిన ఆమె జీవితంలో ఒక చేదు గతం కూడా ఉంది. ఆ గతాన్ని పట్టుకుని ఆమె మీద అనేక మంది బురద జల్లారు. విమర్శలు చేశారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత వేరొకరిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు పెళ్లీడుకి వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళే అమ్మకు తోడుగా ఒక వ్యక్తి ఉండాలని పెళ్లి చేసుకోమంటే కాదనలేక ఆమె వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ విషయంలో ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వాటన్నిటినీ తట్టుకుని ఆమె నిలబడ్డారు. ప్రస్తుతం ఆమె తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు.

ఆమె మరెవరో కాదు సింగర్ సునీత. ఈ ఫోటో 90ల నాటిది. ఓ ప్రముఖ ఛానల్ లో నిర్వహించిన తరం తరం షోలో భాగంగా సరదా అంత్యాక్షరి గేమ్ ఆడారు. ఈ షోలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ, సింగర్ మనో, ఎంఎం శ్రీలేఖ, సింగర్ సునీత పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో సింగర్ సునీత చాలా యాక్టివ్ గా ఉన్నారు. అప్పట్లో హీరోయిన్ ని మించిన అందంతో చాలా క్యూట్ గా ఉన్నారు. తన గాత్రంతో అప్పట్లోనే మ్యాజిక్ చేశారు. మాస్టర్ సినిమాలోని ‘ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు’ అంటూ సింగర్ సునీత పాడారు. ఈ పాటకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డ్యాన్స్ కూడా వేశారు.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş