iDreamPost
android-app
ios-app

విశ్వక్ నో చెప్పింది బాలయ్యకా? ఇండస్ట్రీ టాక్ ఇదే!

  • Published Feb 17, 2024 | 2:37 PM Updated Updated Feb 17, 2024 | 2:37 PM

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్ సేన్ ఒకరు. ప్రస్తుతం ఈ హీరో తన కొత్త సినిమా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే, ఈ హీరో తన అభిమాన హీరో సినిమాలో ఓ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంన్నట్లు టాక్ . ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్ సేన్ ఒకరు. ప్రస్తుతం ఈ హీరో తన కొత్త సినిమా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే, ఈ హీరో తన అభిమాన హీరో సినిమాలో ఓ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంన్నట్లు టాక్ . ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

  • Published Feb 17, 2024 | 2:37 PMUpdated Feb 17, 2024 | 2:37 PM
విశ్వక్ నో చెప్పింది బాలయ్యకా? ఇండస్ట్రీ టాక్ ఇదే!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోస్ లో విశ్వక్ సేన్ ఒకరు. వరుస యూత్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో .. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన ఫేవరేట్ హీరో సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నట్లు .. పరోక్షంగా తెలిపాడు. సో అది ఏ హీరో సినిమా అయ్యి ఉంటుంది. ఎందుకు ఆ ఛాన్స్ ను విశ్వక్ మిస్ చేసుకున్నాడు అనే చర్చలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. దీనితో వరుసగా విశ్వక్ ఫేవరేట్ హీరోస్ ఎవరా అనే ఆరా తీస్తున్నారు .. నెటిజన్లు. ఈ క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెలికి తీశారు. విశ్వక్ మిస్ చేసుకున్న ఆ గోల్డెన్ ఛాన్స్ ను మరో మలయాళ నటుడు క్యాచ్ చేసుకున్నాడట. ఆ నటుడు ఎవరో.. అది ఏ హీరో సినిమానో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

విశ్వక్ మిస్ చేసుకున్న ఆపర్చునిటీ ఎటువంటిదంటే.. వాల్తేరు వీరయ్య సినిమాలో రవి తేజ ఎలా అయితే నటించాడో.. అంతటి స్కోప్ ఉన్న పాత్ర. సినిమాలో ఆ క్యారక్టర్ ను డిజైన్ చేసిన తీరు బాగా నచ్చినా కూడా.. ఆ సినిమాకు నో చెప్పాడట విశ్వక్. అయితే, ఇండస్ట్రీలో విశ్వక్ కు బాగా ఇష్టమైన ఇద్దరు హీరోలు ఎవరంటే బాలకృష్ణ, తారక్ అని అందరు చెప్పేస్తారు. చూస్తుంటే ప్రస్తుతం తారక్ దేవర చిత్రంతో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా రిలీజ్ డేట్స్ కూడా లాక్ అయిపోయాయి. అయినా ఈ సినిమాలో మరో హీరో ఉంటాడు అనే ప్రస్తావనే ఇంతవరకు వినిపించలేదు కాబట్టి.. ఖచ్చితంగా తారక్ ఫిల్మ్ అయితే కాదు. ఇక మిగిలింది బాలకృష్ణ సినిమానే. ప్రస్తుతం బాలకృష్ణ .. డైరెక్టర్ బాబీతో ఓ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రకంగా చూసుకుంటే.. విశ్వక్ మిస్ చేసుకున్న ఛాన్స్ బాలయ్య సినిమాలోదే అని స్పష్టంగా అర్ధమవుతోంది.

అయితే, విశ్వక్ కూడా ఎన్నో ఆడియో ఫంక్షన్స్ లో .. ఎవరు ఎం అనుకున్న తానూ అనుకున్నదే చేస్తానని చెప్పడం.. కొన్ని సినిమాల ప్రమోషన్లలకు రానని చెప్పడం. ఇలా అనేక రకాల డిస్కషన్స్ ను చూశాం. అయితే, ఇప్పుడు ఈ హీరో బాలయ్య సినిమాలో నటించే ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకున్నాడో తెలియదు కానీ, ఒకవేళ ఈ ఛాన్స్ కనుక విశ్వక్ యూజ్ చేసుకున్నట్లైతే .. బాలకృష్ణ, విశ్వక్ ల మధ్య ఉండే సీన్స్ చాలా అద్భుతంగా వచ్చి ఉండేవని ఇన్సైడ్ టాక్. అది కూడా బాబీ డైరెక్షన్ కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఉండేదేమో అని అభిమానులు భావిస్తున్నారు. మరి, విశ్వక్ బాలయ్య సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/