iDreamPost
android-app
ios-app

Dhanush: బర్త్ డే విష్ తెలియజేస్తూ .. కుబేర మూవీ నుంచి ధనుష్ పిక్ రివీల్

  • Published Jul 28, 2024 | 1:29 PM Updated Updated Jul 28, 2024 | 1:29 PM

లేటెస్ట్ గా ధనుష్ నటించిన రాయన్ మూవీ థియేటర్స్ లో పాజిటివ్ టాక్ నే సంపాదించుకుంటుంది. ఇక ఈ మూవీ తర్వాత ధనుష్ కుబేర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ధనుష్ బర్త్ డే సంధర్బంగా కుబేర మూవీ నుంచి ధనుష్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్ .

లేటెస్ట్ గా ధనుష్ నటించిన రాయన్ మూవీ థియేటర్స్ లో పాజిటివ్ టాక్ నే సంపాదించుకుంటుంది. ఇక ఈ మూవీ తర్వాత ధనుష్ కుబేర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ధనుష్ బర్త్ డే సంధర్బంగా కుబేర మూవీ నుంచి ధనుష్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్ .

  • Published Jul 28, 2024 | 1:29 PMUpdated Jul 28, 2024 | 1:29 PM
Dhanush: బర్త్ డే విష్ తెలియజేస్తూ .. కుబేర మూవీ నుంచి ధనుష్  పిక్ రివీల్

ధనుష్ నటించిన రాయన్ మూవీ తెలుగు , తమిళ థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. తెలుగులో కూడా ధనుష్ స్ట్రైట్ చిత్రాలు ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక తెలుగు సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. రాయన్ తర్వాత ధనుష్ నటిస్తున్న మరొక మూవీ.. కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను రివీల్ చేసినప్పుడు అందరికి చాలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. మూవీ టైటిల్ కు ధనుష్ లుక్ కు పొంతనే లేదని కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఈరోజు ధనుష్ పుట్టిన రోజు సంధర్బంగా ఈ సినిమా నుంచి ధనుష్ పిక్ ను రివీల్ చేశారు మేకర్స్.

ఇండస్ట్రీ లో ధనుష్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. శేఖర్ కమ్ముల మూవీస్ కు అదే రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉన్నారు. మరి వీరిద్దరి కాంబోలో మూవీ అంటే ఖచ్చితంగా… శేఖర్ కమ్ముల ఎదో బలమైన కథనే ప్లాన్ చేశారనిపిస్తుంది. ఇప్పటీకే ఈ సినిమాపై అందరికి అంచనాలు పెరిగిపోతున్నాయి. ధనుష్ పుట్టిన రోజు సంధర్బంగా.. శేఖర్ కమ్ముల మూవీ నుంచి ధనుష్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను రివీల్ చేశారు. ఇక ఆ పోస్టర్ లో కూడా ధనుష్ బిచ్చగాడి గెట్ అప్ లోనే.. మాసిన గడ్డంతో కనిపిస్తూ ఉన్నాడు. దీనితో ఫ్యాన్స్ లో ఈ ధనుష్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి మరింత ఎక్కువైపోయింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రివీల్ చేయనున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో ధనుష్ తో పాటు.. రష్మిక మందన , జిమ్ సర్భ్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి రివీల్ చేసిన రష్మిక పోస్టర్ కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయింది. దీనితో అసలు కథ ఏమై ఉంటుంది? శేఖర్ కమ్ముల ప్రేక్షకులకు ఏం చూపించబోతున్నాడు ? ధనుష్ పాత్రలు ఎలా ఉండబోతుంది? ఇలా రకరకాల ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో.. ఆసియన్ సినిమాస్ బ్యానర్ పై.. ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ ఈ సినిమాను ఈ ఏడాదే థియేటర్స్ లో విడుదల చేయనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అబ్బీప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetenjoybet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio