iDreamPost
android-app
ios-app

Devara: ప్రమోషన్స్ ప్రారంభించిన తారక్! అక్కడ ‘దేవర’కు తిరుగులేదు! కారణమిదే..

  • Published Sep 09, 2024 | 9:46 AM Updated Updated Sep 09, 2024 | 9:46 AM

Devara promotios Start: దేవర ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అందుకోసం ముంబైలో అడుగుపెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అక్కడి నుంచి ప్రమోషన్స్ ను ప్రారంభించనున్నాడు.

Devara promotios Start: దేవర ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అందుకోసం ముంబైలో అడుగుపెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అక్కడి నుంచి ప్రమోషన్స్ ను ప్రారంభించనున్నాడు.

  • Published Sep 09, 2024 | 9:46 AMUpdated Sep 09, 2024 | 9:46 AM
Devara: ప్రమోషన్స్ ప్రారంభించిన తారక్! అక్కడ ‘దేవర’కు తిరుగులేదు! కారణమిదే..

‘దేవర’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ తోనే ప్రమోషన్ కార్యక్రమాలను గ్రాండ్ గా ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందులో భాగంగానే తారక్ అండ్ టీమ్ ముంబైలో అడుగుపెట్టింది. నార్త్ బెల్ట్ లో దేవర మూవీకి తిరుగులేదు. దానికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

తారక్ నటించిన దేవర మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటించిన సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికితోడు సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, మూడు పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇవన్నీ దేవరపై భారీ అంచనాలను నెలకొనేలా చేశాయి. ఇక సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ విడుదల కాబోతోంది. దానికోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. అందుకోసం ఇప్పటికే తారక్ ముంబైలో అడుగుపెట్టాడు. అక్కడి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యి.. సినిమా విశేషాలను పంచుకోనున్నారు హీరో కమ్ డైరెక్టర్.

కాగా.. దేవర నార్త్ ఇండియా రైట్స్ ను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ఈ సంస్థ దేవరను నార్త్ ఇండియాలో రిలీజ్ చేసేందుకు రంగంలోకి దిగింది. గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ మూవీని అక్కడి పబ్లిక్ లోకి తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యింది. ఇక ఇప్పుడు దేవరను కూడా అదే రేంజ్ లో తీసుకెళ్లి విజయం సాధించడం పక్కా అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే? కరణ్ జోహార్ తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎలా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. థియేటర్లు, ప్రమోషన్స్ లో కరణ్ పక్కా ప్లానింగ్ తో ఉంటాడు. పైగా అక్కడ ఆయన చెప్పిందే వేదం అనే టాక్ ఉండనే ఉంది. దాంతో ఇవన్నీ కలిసి దేవరకు అక్కడ తిరుగులేకుండా చేస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి కరణ్ జోహార్ అండ్ టీమ్ నార్త్ బెల్ట్ లో దేవర ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తుందో వేచి చూడాలి. ఇక దేవర ట్రైలర్ కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş