iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

  • Published Sep 09, 2024 | 8:22 AM Updated Updated Sep 09, 2024 | 8:22 AM

Tragedy Popular Actor Passed away: గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. తాము ఎంతగానో అభిమానించే ప్రముఖ నటీనటులు కన్నమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.

Tragedy Popular Actor Passed away: గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. తాము ఎంతగానో అభిమానించే ప్రముఖ నటీనటులు కన్నమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.

  • Published Sep 09, 2024 | 8:22 AMUpdated Sep 09, 2024 | 8:22 AM
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. హార్ట్ ఎటాక్, వయోభారం, క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో రకాలుగా సెలబ్రెటీలను మృత్యువు వెంటాడుతుంది. సినీ ప్రముఖులు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. మరికొంత మంది సెలబ్రెటీలు కెరీర్ బాగాలేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా చనిపోతున్నారు. ఇటీవల ఆదిపురుష్ నటి ఆశా వర్మ, మాలీవుడ్ నటుడు నిర్మల్ బెన్నీ కన్నుమూశారు. ఈ విషాదాల నుంచి కోలుకోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వినాయక చవితి వేళ బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు వికాస్ సేథి (48) గుండెపోటుతో కన్నమూశారు. వికాస్ సేథీ అకాల మరణంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. వినాయక చవితి సంబరాల్లో ఉన్న అభిమానులు, సెలబ్రెటీలు ఆయన మరణ వార్త విని ఒక్కసారే షాకయ్యారు. వికాస్ సేథీ నిద్రపోతున్న సమయంలోనే అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందని, గుండె నొప్పితో బాధపడుతుండగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను  ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వికాస్ సేథీ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని కుటుంబీకులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

వికాస్ సేథి చాలా ఏళ్లుగా బుల్లితెర ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. సీరియల్స్ లోనే కాకుండా పలు రియాల్టీ షోస్ లో కూడా పాల్గొంటున్నారు. కసౌతీ జిందకీ కె, కహి తో హూగా, కియోంకీ సాస్ బి కబీ బహుథీ, స్ట్రీట్ పాలి హిల్, హమారీ బెత్యోంకా వివాహ్, దుర్ సబ్కో లగ్తా హై, సరురల్ సిమర్ కా, సంస్కార్ లక్ష్మి వంటి పాపులర్ సీరియల్స్ లో నటించాడు. అలాగే కభీ ఖుషీ కభీ గమ్, ఆప్స్, స్మార్ట్ శంకర్, దీవానాపన్ వంటి మూవీస్ లో కూడా వికాస్ నటించారు. పండగు పూట ఇలాంటి విషాదం నెలకొండంతో అభిమానులు తీవ్ర విషాదంతో మునిగిపోయారు. సెలబ్రెటీలు ఆయనకు నివాళులర్పించారు.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş