iDreamPost
android-app
ios-app

Mahesh Babu: SSMB29 వెనక్కి వెళ్లిందా? షూటింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Sep 13, 2024 | 10:48 AM Updated Updated Sep 13, 2024 | 10:48 AM

SSMB29 Movie Shooting Update: సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29 షూటింగ్ వెనక్కి వెళ్లిందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇంతకీ షూటింగ్ ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందంటే?

SSMB29 Movie Shooting Update: సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29 షూటింగ్ వెనక్కి వెళ్లిందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇంతకీ షూటింగ్ ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందంటే?

  • Published Sep 13, 2024 | 10:48 AMUpdated Sep 13, 2024 | 10:48 AM
Mahesh Babu: SSMB29 వెనక్కి వెళ్లిందా? షూటింగ్ ఎప్పటినుంచంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే SSMB29 మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా మేకర్స్ ఇవ్వలేదు. సూపర్ స్టార్ పుట్టినరోజు నాడు ఏదో ఒక అప్డేట్ వస్తుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. అయితే ఈ ఏడాదిలోనే  షూటింగ్ ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. ఈ చిత్రం ఈ ఏడాదిలో స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురౌతున్నారు. మరి షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

SSMB29.. రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు నటించబోయే ఈ చిత్రం కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో జక్కన్న రేంజ్ కూడా గ్లోబల్ వైడ్ విస్తరించింది. ఆ రేంజ్ కు ఇంకాస్త ఎక్కువే ఉండేలా ఈ సినిమాను తీర్చిదిద్దడానికి రాజమౌళి ప్లాన్స్ వేస్తున్నాడు. అందులో భాగంగానే షూటింగ్ ప్రారంభం ఆలస్యం అవుతుంద. సాధారణంగా జక్కన్న తన సినిమాలకు దాదాపు ఆరేడు నెలలు ప్రీ ప్రొడక్షన్ పనులకే కేటాయిస్తాడు. ప్రతీ ఫ్రేమ్ ను అద్భుతంగా చూపించడానికి దాన్ని చెక్కుతూ ఉంటాడు. అందుకే ఆయన సినిమాలు దాదాపు రెండు సంవత్సరాల టైమ్ తీసుకుంటాయి. అయితే సూపర్ స్టార్ తో తీయబోయే సినిమాకు ఏకంగా సంవత్సరం పాటు  ప్రీ ప్రొడక్షన్ పనులకే కేటాయించాలని భావించాడట జక్కన్న. అందులో భాగంగానే షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

అసలు ఈ మూవీ షూటింగ్ ను ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ జక్కన్న ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకున్న తర్వాతే షూట్ కు వెళ్లాలని భావిస్తున్నాడట. అందుకే వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ న్యూస్ కాస్త ఫ్యాన్స్ చెవిన పడటంతో.. వారు అసంతృప్తి చెందుతున్నారు. ఇప్పటికే తమ హీరో సినిమా గురించి కనీసం ఒక్క అప్డేట్  కూడా లేదని జక్కన్నపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. అది చాలదన్నట్లు  ఇప్పుడు ఇది. జనవరిలో అయినా షూటింగ్ ప్రారంభిస్తే.. అదే పది వేలు అని మరికొంత మంది అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమా టైటిళ్ల విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘గోల్డ్’ లేదా ‘గరుడ’ టైటిళ్లను మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన వర్క్ షాప్ లో విలన్ తో పాటుగా ఇతర కీలక నటులు కూడా పాల్గొంటున్నట్లు టాక్. అయితే ఆ విషయాలు మాత్రం బయటకి రాకుండా జక్కన్న జాగ్రత్త పడుతున్నాడు. కాగా.. ఈ మూవీలో మహేశ్ లుక్ ఇప్పటికే వైరల్ గా మారిన విషయం తెలిసిందే. లాంగ్ హెయిర్ తో సూపర్ స్టార్ లుక్ అదిరిపోయింది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom