iDreamPost
android-app
ios-app

దేవర ఆలస్యం.. దేవరకొండకి అదృష్టం! మంచి ఛాన్స్!

  • Published Jan 24, 2024 | 11:41 AM Updated Updated Jan 24, 2024 | 11:41 AM

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ చిత్రం దేవర. ఈ ఇద్దరి కాంబోలో జనతా గ్యారేజ్ తెరకెక్కగా.. ఎంతటి ఘన విజయం సొంతం చేసుకుందో తెలుసు. ఇప్పుడు ఈ ఇద్దరూ దేవరతో ముందుకు వస్తున్నారు. రెండు విభాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే..

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ చిత్రం దేవర. ఈ ఇద్దరి కాంబోలో జనతా గ్యారేజ్ తెరకెక్కగా.. ఎంతటి ఘన విజయం సొంతం చేసుకుందో తెలుసు. ఇప్పుడు ఈ ఇద్దరూ దేవరతో ముందుకు వస్తున్నారు. రెండు విభాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే..

  • Published Jan 24, 2024 | 11:41 AMUpdated Jan 24, 2024 | 11:41 AM
దేవర ఆలస్యం.. దేవరకొండకి అదృష్టం! మంచి ఛాన్స్!

సంక్రాంతి సందడి ముగిసింది. నాలుగు బడా సినిమాలు పోటీలోకి దిగి తమ సత్తాను చాటుకున్నాయి. ముగ్గురు బడా హీరోలు నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబుతో పాటు ఓ కుర్ర హీరో తేజ సజ్జా పెద్ద పండుగకు వచ్చి ప్రేక్షకులకు కనువిందు చేశారు. రవితేజ ఈగల్ మూవీ కూడా విడుదల కావాల్సి ఉండగా.. చిన్న ఒప్పందంతో బరి నుండి తప్పుకున్న సంగతి విదితమే. ఇది ఫిబ్రవరి 9న సింగిల్ మూవీ రిలీజ్ ఒప్పందంతో ఆ రోజే విడుదల కావాల్సిన టిల్లు స్క్వేర్ కూడా పోస్టు పోన్ అయ్యింది. అలాగే ఫ్యామిలీ స్టార్ కూడా సంక్రాంతి రేసు నుండి తప్పుకుని మరో తేదీ కోసం వెయిట్ చేస్తుంది.  మార్చిలో రిలీజ్ చేయాలన్న ప్లాన్స్‌లో ఉన్నారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ సినిమాలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

పెద్ద సినిమా విడుదల నేపథ్యంలో కొన్ని సినిమాలు వాయిదా పడటం పరిపాటి. ఇండస్ట్రీకి మంచిది కాదని తప్పుకుంటూ ఉంటాయి. అలాగే వాటి సినిమా విడుదల కూడా వాటికి ముఖ్యమే. అదే జరుగుతుంది ఈ సినిమాల విషయంలో.  టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ మూవీస్ విడుదల విషయంలో కాస్తంత గందరగోళం నెలకొంది. మార్చి-ఏప్రిల్లో విడుదల చేద్దామంటే..అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంది. దీంతో ఈ రెండు సినిమాలు దేవర తర్వాత.. ముందా అన్న సందిగ్ధతలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ ఇండస్ట్రింగ్ అప్ డేట్ వస్తోంది. అదేంటంటే.. దేవర మూవీ పోస్ట్ పోన్ అవుతుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి బ్రేకులు పడ్డాయి. దీంతో సినిమా విడుదల తేదీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సైఫ్ అలీఖాన్ ప్రమాదం జరగడంతో పాటు వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కారణంగా ఈ చిత్రం వాయిదా పడవచ్చునని ఇండస్ట్రీలో టాక్ విపరీతంగా నడుస్తోంది.

దేవర మూవీ ఏప్రిల్ రేసు నుండి డ్రాప్ అయ్యి.. సెప్టెంబర్ నెలలో విడుదల అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ బజ్ విపరీతంగా వస్తోంది. ఇదే జరిగితే.. అటు సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ కానీ, విజయ్ దేవర కొండ ఫ్యామిలీ స్టార్ కానీ ఈ తేదీని ఆక్యుపై చేయొచ్చు. ముఖ్యంగా విజయ్ దేవర కొండకు ఈ తేదీ మంచి అదృష్టంగా మారొచ్చు. ఆ సమయంలో ఉగాది పండుగ రావడంతో.. ఆ సెలవులను క్యాష్ చేసుకుంటూ.. ఫ్యామిలీ స్టార్ మూవీని విడుదల చేస్తే.. కలెక్షన్లు రాబట్టుకోవచ్చు. ఫ్యామిలీ స్టార్ దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న సంగతి విదితమే. మృణాల్ ఠాకూర్, దివ్యాంగ కౌశిక్ హీరోయిన్లు. గీతా గోవిందంతో దేవరకొండను ఫ్యామిలీ మెన్‌గా మార్చేసిన పరుశురాం.. ఈ మూవీకి దర్శకుడు. టిల్లు స్క్వేర్ చిత్రాన్ని నాగ వంశీ నిర్మిస్తున్నారు. చూడాలి మేకర్స్ ఏ డేట్స్ ప్రకటిస్తారో.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş