iDreamPost
android-app
ios-app

Sushmita Sen: శృం*గారం.. నా కూతుళ్లు ఎప్పుడో PHD చేశారు.. సుస్మితా సేన్ షాకింగ్ కామెంట్స్!

  • Published Jul 26, 2024 | 12:11 PM Updated Updated Jul 26, 2024 | 12:11 PM

తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో సె*క్స్ ఎడ్యూకేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్. ఆ విషయంలో నా కూతుళ్లు ఎప్పుడో PHDలు చేశారని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో సె*క్స్ ఎడ్యూకేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్. ఆ విషయంలో నా కూతుళ్లు ఎప్పుడో PHDలు చేశారని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

Sushmita Sen: శృం*గారం.. నా కూతుళ్లు ఎప్పుడో PHD చేశారు.. సుస్మితా సేన్ షాకింగ్ కామెంట్స్!

సమాజంలో ఉన్న కొన్ని కొన్ని అపోహల గురించి, మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి పిల్లలకు వివరంగా చెప్పే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. మరీ ముఖ్యంగా సె*క్స్ ఎడ్యూకేషన్ గురించి నేటి కాలం పిల్లలకు వివరించాల్సిన ప్రాముఖ్యం ఎంతైనా ఉంది. లేకపోతే.. దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో పిల్లలు అడ్డదారులు తొక్కే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో సె*క్స్ ఎడ్యూకేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్. ఆ విషయంలో నా కూతుళ్లు ఎప్పుడో PHDలు చేశారని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

సె*క్స్ ఎడ్యూకేషన్ పై చిన్నతనం నుంచే పిల్లల్లో అవగాహన పెంచాలని సూచిస్తోంద మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్. ఈ విషయంపై తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడింది. “నేటి సమాజంలో లైంగిక అంశాల గురించి మాట్లాడితే.. దాన్ని తప్పుగా భావిస్తున్నారు. 90ల్లో నేను, మా అమ్మ ఈ టాపిక్ పై చాలా ఓపెన్ గా చర్చించుకునేవాళ్లం. అప్పుడు నాకు 14-15 సంవత్సరాలు అనుకుంటా. ఏదైనా ఉంటే..నేను మా అమ్మను నిర్మొహమాటంగా అడిగేదాన్ని. తను కూడా అంతే విపులంగా ఆన్సర్ ఇచ్చేంది. అందుకే సె*క్స్ ఎడ్యూకేషన్ గురించి మాట్లాడేటప్పుడు నేను సిగ్గుపడను. ఇక నా కూతుళ్లకు సె*క్స్ ఎడ్యూకేషన్ గురించి వివరించాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లు ఆల్రెడీ PHD చేశారు. చిన్న వయసులోనే వీటి గురించి తెలుసుకోవడం ద్వారా ఏది మంచో.. ఏది చెడో తెలుసుకోగలుగుతారు” అంటూ చెప్పుకొచ్చింది సుస్మితా సేన్.

Sushmithasen

ఇక తన చిన్న కూతురు అలీసాకు ఈ ఎడ్యూకేషన్ పై మరింత అవగాహన ఉన్నట్లు ఆమె తెలిపింది. ఎందుకంటే? అలీసా బయాలజీ స్టూడెంట్. ఇంట్లో తరచుగా శృంగారానికి సంబంధించిన టాపిక్స్ వస్తుంటాయని, వాటి గురించి మేం కామన్ గానే మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చింది సుస్మితా సేన్. ప్రతి ఒక్కరికి ఈ విషయంలో భావాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుందని, అందులో తప్పేం లేదని ఈ సందర్భంగా పేర్కొంది. అయితే కొందరు ఆమె వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. మరి సుస్మితా సేన్ సె*క్స్ ఎడ్యూకేషన్ పై చేసిన కామెంట్స్ మీకేవిధంగా అనిపించాయో.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.