iDreamPost
android-app
ios-app

ఫ్యాన్ గా నయన్ చేయలేనిది! ఫ్రెండ్ గా దీపికా చేసింది!

  • Author ajaykrishna Updated - 04:24 PM, Sat - 16 September 23
  • Author ajaykrishna Updated - 04:24 PM, Sat - 16 September 23
ఫ్యాన్ గా నయన్ చేయలేనిది! ఫ్రెండ్ గా దీపికా చేసింది!

ఇండస్ట్రీలో డబ్బే కాదు.. అప్పుడప్పుడు స్నేహం కూడా గెలుస్తుంది. కొందరు సెలబ్రిటీల స్నేహాన్ని కూడా రెమ్యూనరేషన్ తో లెక్కేస్తుంటారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ విషయంలో అలాంటి ప్రచారమే జరుగుతుంది. పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇటీవల జవాన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు షారుఖ్ ఖాన్. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా.. భారీ అంచనాల థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఆడియన్స్ అంచనాలకు తగినట్లుగానే సినిమా ఉండటంతో.. ఫస్ట్ డే నుండి జవాన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. పాజిటివ్ టాక్ తో పాటు కలెక్షన్స్ పరంగాను అద్భుతాలు సృష్టిస్తోంది. కాగా.. జవాన్ లో షారుఖ్ డ్యూయెల్ రోల్ పోషించాడు.

షారుఖ్ కి జంటగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే.. సౌత్ స్టార్ నయనతార నటించారు. సినిమాలో మెయిన్ హీరోయిన్ నయనతార అయినప్పటికీ.. దీపికా పదుకొనే చిన్న క్యామియో రోల్ లో మెరిసింది. అయితే.. షారుఖ్ సరసన నటించడం నయన్ కి మొదటిసారి కాగా.. దీపికా చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ వీరి ఖాతాలో ఉన్నాయి. ఓవైపు జవాన్.. బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్లు దాటి పరుగులు పెడుతోంది. ఈ సినిమాని షారుఖ్, ఆయన సతీమణి గౌరీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాగా.. తాజాగా జవాన్ సక్సెస్ మీట్ ముంబైలో గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ ఈవెంట్ కి మూవీ టీమ్ తో పాటు షారుఖ్, దీపికా హాజరయ్యారు. కాగా.. కొద్దిరోజులుగా జవాన్ కోసం స్టార్స్ రెమ్యూనరేషన్ ఇవేనంటూ కొన్ని నెంబర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ నయన్ ఏకంగా రూ. 11 కోట్లు తీసుకుందని.. దీపికా కూడా కనిపించింది కాసేపే అయినా గట్టిగానే ఛార్జ్ చేసుంటుందని ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి దీపికా ఫుల్ స్టాప్ పెట్టేసిందట. తాను జవాన్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, ఆ క్యారెక్టర్ నచ్చి చేశానని తేల్చేసిందట. దీంతో ట్రోల్స్ చేసేవారంతా సైలెంట్ అయిపోయారు. అయితే.. నయన్ షారుఖ్ కి పెద్ద అభిమాని. కానీ.. రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా తగ్గలేదని సినీవర్గాల టాక్. సో.. ఫ్యాన్ గా నయన్ చేయలేనిది, ఫ్రెండ్ గా దీపికా చేసిందని షారుఖ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet