P Krishna
Darshan Murder Case: చట్టం ముందు ఎవరైనా తల దించాల్సిందే.. నేరం చేసిన వాడు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఈ మధ్య సెలబ్రెటీలు పలు నేరాల్లో ఇరుక్కొని వరుసగా జైలుకు వెళ్తున్న విషయం తెలిసిందే.
Darshan Murder Case: చట్టం ముందు ఎవరైనా తల దించాల్సిందే.. నేరం చేసిన వాడు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఈ మధ్య సెలబ్రెటీలు పలు నేరాల్లో ఇరుక్కొని వరుసగా జైలుకు వెళ్తున్న విషయం తెలిసిందే.
P Krishna
సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు వరుసగా అరెస్ట్ అయి జైలుకు వెళుతున్నారు. కన్నడ ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ హీరో దర్శన్ ని మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం పెను సంచలనంగా మారింది. తన ప్రియురాలు పవిత్ర గౌడ్‌కు రేణుకాస్వామి అనే వ్యక్తి కొన్నిరోజులుగా అసభ్య మేసేజ్, అశ్లీల ఫోటోలు పంపుతున్నాడని ఫిర్యాదు రావడంతో కోపంతో రగిలిపోయి 10 మందికి సుపారీ ఇచ్చి చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని చంపించిన కేసులో మైసూర్ లోని తన ఫామ్ హౌజ్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఈ కేసులో దర్శన్ కి మరింత ఉచ్చు బిగుస్తుంది.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించినట్లు వార్తలు వస్తున్నాయి.వివరాల్లోకి వెళితే..
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసులో కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో రేణుకాస్వామి డెడ్ బాడీని తీసుకువెళ్లందుకు వినియోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు. కన్నడ ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరు దర్శన్. ఓ మామూలు వ్యక్తిని ఎందుకు చంపించాడు అని ఇండస్ట్రీ వర్గం.. అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రెడ్ స్కార్పియో కారు దర్శన్ దే అని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. పవిత్ర గౌడ ను ఆన్ లైన్ లో వేధింపులకు గురి చేసిన రేణుకాస్వామిని కావాలని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
చిత్ర దుర్గలో నమోదు అయిన మిస్సింగ్ కేసు ఫిర్యాదులో భాగంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా.. పలు కీలక ఆధారాలు లభ్యమవుతున్నాయి. రేణుకా స్వామి హత్య కేసులో మొదట ముగ్గురు లొంగిపోయారు.. వారి ద్వారా దర్శన్ పేరు వెలుగులోకి వచ్చింది. దర్శన్ తో పాటు మరో పదిమందిని ఈ హత్య కేసులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత ఆరేళ్లుగా పవిత్ర గౌడ తో దర్శన్ రిలేషన్ షిప్ లో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పవిత్ర గౌడ తనను రేణుకాస్వామి వేదిస్తున్నాడని దర్శన్ కి చెప్పడంతో కోపంతో ఈ పని చేసి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా పోలీసులకు లభించిన సీసీటీవి ఫుటేజ్ కీలక ఆధారంగా మారడంతో రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ కి గట్టిగానే ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది.
In #Bengaluru: CCTV footage from near the spot where 33-year-old Renukaswamy’s body was found shows Kannada film actor #Darshan’s Jeep (red colour) following the Scorpio that was reportedly used for dumping the body. pic.twitter.com/wOpm5sxq7I
— TOI Bengaluru (@TOIBengaluru) June 12, 2024