iDreamPost
android-app
ios-app

భర్త దగ్గరికి మహిళలను పంపుతూ.. ఛీ ఈమె అసలు ఆడదేనా!

  • Published Sep 14, 2024 | 10:16 AM Updated Updated Sep 14, 2024 | 11:32 AM

Hyderabad Couple Given Life Sentence: ఈ మధ్య కాలంలో ఆడవాళ్లపై జరుగుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఒంటరిగా ఉండే మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా వీరిలో మార్పు రావడం లేదని పోలీసులు అంటున్నారు.

Hyderabad Couple Given Life Sentence: ఈ మధ్య కాలంలో ఆడవాళ్లపై జరుగుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఒంటరిగా ఉండే మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా వీరిలో మార్పు రావడం లేదని పోలీసులు అంటున్నారు.

  • Published Sep 14, 2024 | 10:16 AMUpdated Sep 14, 2024 | 11:32 AM
భర్త దగ్గరికి మహిళలను పంపుతూ.. ఛీ ఈమె అసలు ఆడదేనా!

ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.  ప్రభుత్వాలు నిర్భయ, దిశ లాంటి చట్టాలు  తీసుకువచ్చినా  కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదని అంటున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు మృగాలుగా మారి లైంగిక వేధింపులు,అత్యాచారాలకు తెగబడుతున్నారు.  చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామంధులు ఎవరినీ వదలడం లేదు. దారుణం ఏంటంటే ఇలాంటి ఘటనల్లో మైనర్లు కూడా ఉంటున్నారు.  తాజాగా ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని అత్యాచారం చేసి హత్య చేస్తున్న భర్త.. అతడికి సహకరిస్తున్న భార్యకు కోర్టు జీవిత ఖైదు విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల కొంతమండి డబ్బు కోసం ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. ఆడవాళ్ళకు ఆడవాళ్లే శత్రువులు అన్న సామెత నిజం చేసింది ఓ మహిళ. ఒంటరిగా ఉన్న మహిళలను అత్యాచారం చేసి వారి వద్ద ఉన్న డబ్బు, బంగారం లాక్కొని దారుణంగా హత్య చేసే భర్త.. అతడి అకృత్యాలకు దగ్గరుండి మరీ సహకరించే భార్య దారుణాల గురించి తెలుసుకొని పోలీసులే నివ్వెరపోయారు. సంచలనం సృష్టించిన ఈ భార్యాభర్తల నేరాల కేసుల్లో శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోర్టు విడివిడిగా తీర్పులు వెల్లడించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని జనగాం గ్రామానికి చెందిన కురువ స్వామి అలియాస్ రవి (30) అతడి భార్య మానస మొల్ల నర్సమ్మ అలియాస్ కురువ నర్సమ్మ భార్యాభర్తలు. పెళ్లైన తర్వాత కొంతకాలం చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వైఎస్సార్ కాలనీలో స్థిరపడ్డారు. అయితే డబ్బున్న వాళ్లను చూసి తాము కూడా లగ్జరీగా జీవించాలనే ఆలోచన వచ్చింది. అందుకు డబ్బు తక్కువ సమయంలో డబ్బు సంపాదించే మార్గాలు వెతికారు.

ఇందుకోసం ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకున్నారు. 2024 జులై 25న మల్లంపేట్ అడ్డాలో పనికోసం ఎదురు చూస్తున్న ఓ మహిళా కూలీకి పని ఉందని చెప్పి బైక్ పై తీసుకువెళ్లారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంత్రికుంట గ్రామ శివారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసువెళ్లి ఆ మహిళపై రవి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ మహిళ తిరగబడటంతో భార్య నర్సమ్మ ఆమెను గట్టిగా బంధించింది.. రవి ఆ మహిళపై అత్యాచారం చేయడమే కాదు.. దారుణంగా హత్య చేశారు. బాధితురాలి ఒంటిపై బంగారం దోచుకున్నారు. ఈ క్రమంలోనే దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జీ శుక్రవారం జీవితఖైదు విధించారు. గతంలో ఈ దంపతుల అకృత్యాలు పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు వెలువరించినట్లు తెలుస్తుంది.

2021 శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ జులై 18న సింగారపురం గ్రామంలో ఒంటరిగా ఉన్న ఓ మహిళకు కూలీ చూపిస్తా అని రవి భార్య నర్సమ్మ బులక్‌పూర్‌గేట్ సమీపంలోని నిర్జీవ ప్రదేశానికి తీసుకు వెళ్లింది. అప్పటికే అక్కడ కాపు కాస్తున్న రవి ఆ మహిళపై దాడి చేసి భార్య నర్సమ్మ సాయంతో అత్యాచారానికి పాల్పపడ్డాడు. అచేతనంగా పడి ఉన్న ఆమె చనిపోయిందనుకొని భావించి సెల్ ఫోన్, బంగారం తీసుకొని పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దంపతులపై అనుమానం వచ్చి విచారణ చేయగా నేరం ఒప్పుకునన్నారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.కేసు విచారణ చేసిన కోర్టు భర్తకు పదేళ్ళు, భార్యకు ఏడేళ్లు శిక్ష విధించింది. ఇదే తరహాలో అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దోపిడికి పాల్పడ్డ దంపతులకు కోర్టు ఏడాది చొప్పున జైలు శిక్ష విధించింది. ఒంటరిగా ఉండే మహిళలు అపరిచితులను నమ్మి వారి వెంట వెళ్లకూడదని.. ఒకవేళ వెళ్లినా ఎవరైన బంధువులు, పరిచయస్తులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.