iDreamPost
android-app
ios-app

కొడుకుని చంపారంటూ..నడిరోడ్డుపై తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు!

  • Published Nov 14, 2024 | 5:31 PM Updated Updated Nov 14, 2024 | 5:31 PM

Sanga Reddy Crime News: పాత కక్ష మనసులో పెట్టుకొని నడిరోడ్డుపై అతి దారుణంగా తల్లీకొడుకును కిరాతకంగా హత్య చేసి చంపాడు ఓ వ్యక్తి. సంగారెడ్డి జిల్లా జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతుంది.

Sanga Reddy Crime News: పాత కక్ష మనసులో పెట్టుకొని నడిరోడ్డుపై అతి దారుణంగా తల్లీకొడుకును కిరాతకంగా హత్య చేసి చంపాడు ఓ వ్యక్తి. సంగారెడ్డి జిల్లా జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతుంది.

  • Published Nov 14, 2024 | 5:31 PMUpdated Nov 14, 2024 | 5:31 PM
కొడుకుని చంపారంటూ..నడిరోడ్డుపై తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు!

ఈ మధ్య కాలంలో కొంతమంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురవుతూ ఎదుటి వారిపై దాడులు, హత్యలు చేస్తున్నారు. సంగారెడ్డి లో గురువారం దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న తల్లీకొడుకులను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు.ఈ ఘటన చూసి చుట్టుపక్కల వాళ్లు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలోని వీరభద్రనగర్ కాలనిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. నిందితుడి నాగరాజు(30)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, చనిపోయిన తల్లీకొడుకులు ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన సరోజాదేవి (50), అనిల్ (30) గా గుర్తించారు. పాత గొడవలే హత్యకు కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజు దంపతులు కొంతకాలంగా బొంతపల్లిలోని వీరభద్రనగర్ ఉంటున్నారు. వీరి రెండేళ్ల కొడుకు చావుకు కారణం మృతులు సరోజాదేవి ఆమె కొడుకు అనిల్ అని నాగరాజు భావించి వారిపై కక్ష్య పెంచుకున్నాడు. అంతేకాదు తన భార్యపై మృతులిద్దరూ దాడి చేసేందుకు ఇంట్లోకి వచ్చారన్న విషయం తెలుసుకొని కోపంతో రగిలిపోయాడు నాగరాజు. ఈ క్రమంలోనే గురువారం బొంతపల్లిలో తల్లీకొడుకులతో గొడపడ్డాడు. ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారి తన వద్ద ఉన్న కత్తితో ఇద్దరిని కిరాతకంగా పొడిచి చంపాడు. ఆ సమయంలో చుట్టు పక్కల వాళ్లు ఆపడానికి వస్తే వారిని కూడా చంపేస్తానని బెదిరించాడు. దాంతో అతన్ని ఏమీ చేయలేకపోయామని స్థానికులు అంటున్నారు. హత్య చేసిన తర్వాత నిందితుడు.. అతని భార్య అక్కడ నానా బీభత్సం సృష్టించారు.

తన కొడుకు చనిపోవడానికి వారే కారణం అని.. తన భార్యను కూడా కొట్టి చంపేందుకు ప్రయత్నిస్తున్నారన్న కోపంతో చంపానని అంటున్నాడు నాగరాజు. మరోవైపు వీరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని.. పాత కక్ష్యల నేపథ్యంలో హత్య చేసి ఉంటారని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు చనిపోయిన రెండేళ్ల తర్వాత కక్ష పెంచుకుని హత్య చేసి ఉంటాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోనంలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా పట్టపగలు అందరూ చూస్తుండగా డబుల్ మర్డర్ జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్షణికావేశంలో చేస్తున్న నేరాల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయని అంటున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş