iDreamPost
android-app
ios-app

తండ్రి హత్యతో పోలీస్‌గా మారిన కూతురు! 25 ఏళ్ల తర్వాత..! సినిమాను మించిన క్రైమ్ స్టోరీ!

  • Published Oct 15, 2024 | 5:49 PM Updated Updated Oct 15, 2024 | 5:49 PM

Brazil Woman: సినీ ప్రేమికులు ఎక్కవగా రివేంజ్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. అలాంటి సినిమాలే ఈ మధ్యకాలంలో బాగా హిట్ అవుతున్నాయి. అచ్చం సినిమా స్టైల్లో నిజ జీవితంలో జరిగిన స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.

Brazil Woman: సినీ ప్రేమికులు ఎక్కవగా రివేంజ్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. అలాంటి సినిమాలే ఈ మధ్యకాలంలో బాగా హిట్ అవుతున్నాయి. అచ్చం సినిమా స్టైల్లో నిజ జీవితంలో జరిగిన స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.

తండ్రి హత్యతో పోలీస్‌గా మారిన కూతురు! 25 ఏళ్ల  తర్వాత..! సినిమాను మించిన క్రైమ్ స్టోరీ!

చిన్నతనంలో తమ కళ్ల ముందే తల్లిదండ్రులను హత్య చేసి పారిపోయిన హంతకులపై పగ పెంచుకుంటారు పిల్లలు. పెద్దయ్యాక పోలీస్, లాయర్ గా మారి నేరస్థులను కనిపెట్టి వారికి శిక్షపడేలా చేస్తారు. ఇలాంటి రివేంజ్ స్టోరీలు వెండితెరపై చూస్తుంటే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఈ తరహా రివేంజ్ క్రైమ్ స్టోరీలతో కూడుకున్న ఎన్నో వచ్చాయి. అచ్చం సినిమా స్టోరీని తలపించే ఓ రియల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఏ నేరం చేయని తన తండ్రిని హత్య చేసిన ఓ హంతకుడిని బాధితుడి కూతురు పాతికేళ్ళ తర్వాత పట్టుకొని పగతీర్చుకుంది. అందుకోసం ఆమె ఎన్నో కష్టాలు పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రెజిల్ లో సినిమా తరహాలో జరిగిన ఓ రివేంజ్ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బ్రెజిల్ లో రొరైమాలోని గిస్టెనే సిల్వా డి డ్యూస్ అనే 35 ఏళ్ల మహిళ తన తండ్రిని చంపిన వాడిపై ప్రతికారం తీర్చుకోవడానికి పోలీస్ గా మారింది. అంతేకాదు తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని పాతికేళ్ల తర్వాత పగ తీర్చుకుంది. మొత్తానికి నేరస్తుడికి శిక్ష పడ్డాక సంతోషంలో మునిగిపోయింది. అసలేం జరిగిందంటే.. గిస్టెనే సిల్వా‌డి డ్యూస్ అనే మహిళా పోలీస్ తండ్రి జోస్ విసెంట్ 1999 లో మార్కెట్ లో కూరగాయలు సప్లై చేసే డ్రైవర్ రైముండో అల్వెస్‌ గోమ్స్‌ వద్ద 20 పౌండ్లు బాకీ పడ్డాడు. దాని విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగి పెద్ద గొడవగా మారింది. అప్పటికీ తన వద్ద ఉన్న ఫ్రీజ్‌ని తీసుకోమని చెప్పాడు జోస్. అయినా క్షణికావేశంలో అల్వెస్‌ గోమ్స్‌ తన వద్ద ఉన్న గన్ తో జోస్ ని కాల్చి చంపాడు.

2013 లో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి గోమ్స్ ని పట్టుకొని 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఆ తీర్పు అప్పీల్ చేస్తూ జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు గోమ్స్. 2016 లొ అతని చివరి అప్పీల్ రిజక్ట్ అయి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది. కానీ గోమ్స్ చాక చక్యంగా తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇదంతా జరిగిన సమయంలో జోస్ విసెంట్ కూతురు సిల్వా‌డి డ్యూస్ వయసు 9 ఏళ్లు. అప్పుడే తన తండ్రిని చంపిన వాడిపై రివేంజ్ తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. అందు కోసం డ్యూస్ 19 ఏళ్ళ వయసు వయసులోనే లాయర్ పట్టా పుచ్చుకుంది. తర్వాత పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరింది. వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తూ.. తన తండ్రిని హత్య చేసిన నిందితుడు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టింది.

హంతకుడి కోసం ఆచూకీకై అలుపెరుగని పోరాటం చేసిన డ్యూస్ ఎట్టకేలకు తన ప్రయత్నంలో విజయం సాధించింది. తన తండ్రిని చంపిన గోమ్స్ బోయా విస్టాకు సమీపంలో ఉన్న నోవా సిడెడ్ ప్రాంతంలోని ఒక పొలంలో దాక్కున్నట్లు గుర్తించింద.గత నెల 25 న అతన్ని పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసింది. 60 ఏళ్ల వయసు లో గోమ్స్ ని జైలుకు పంపించింది. ఈ సందర్భంగా డ్యూస్ మాట్లాడుతూ.. ‘నా కళ్ల ముందు నాన్నను చంపిన వ్యక్తిని చూడగానే ఉద్రేకంతో ఊగిపోయాను. నువు అన్యాయంగా చంపిన జోస్ విసెంట్ కూతురిని నేను.. నేనే నిన్ను పట్టుకొని జైలుకు పంపుతున్నా అంటూ అతని చెప్ప చెల్లుమనేలా చెప్పాను. ఇప్పుడు నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పింది.