iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ లో వెరైటీ ప్రమోషన్స్.. స్ట్రాటజీ అదుర్స్!

Promotional Strategy in Tollywood: ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైనది. అలానే ప్రమోట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సినిమాను ఎంత కొత్తగా ప్రమోట్ చేసుకుంటే..అంత ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఓ కొత్త ప్రమోషన్ల స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.

Promotional Strategy in Tollywood: ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైనది. అలానే ప్రమోట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సినిమాను ఎంత కొత్తగా ప్రమోట్ చేసుకుంటే..అంత ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఓ కొత్త ప్రమోషన్ల స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.

టాలీవుడ్ లో వెరైటీ ప్రమోషన్స్.. స్ట్రాటజీ అదుర్స్!

సినిమాలకు ప్రమోషన్స్ అనేది చాలా ముఖ్యమైనది. అందుకే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు ప్రమోషన్లు చేస్తుంటాయి. ఇక పెద్ద సినిమాల ప్రమోషన్లు అయితే కాస్తా భిన్నంగా ఉంటాయి. మూవీ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ కొత్త  పంథాలను ఎంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో ప్రమోషన్స్ విషంలో టాలీవుడ్ లో ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతను గట్టిగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఒక ఇంటర్వ్యూ చేస్తే.. రెండు సినిమాలు హెల్ప్ అయ్యేలా ఉండాలి అన్నట్లు మన హీరోలు ప్లాన్ చేస్తున్నారు. అందుకే కొత్త రకం ఇంటర్వ్యూస్ కి  మన హీరోలు తెరతీస్తున్నారు. తాజాగా దేవర కూడా అదే ఫాలో అయ్యారు. ఇంతకీ  ఒక్క దెబ్బకు రెండు పిట్టల కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైనది. అలానే ప్రమోట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సినిమాను ఎంత కొత్తగా ప్రమోట్ చేసుకుంటే..అంత ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తుంటారు. అందుకోసమే మన టాలీవుడ్ హీరో కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అదే క్రాస్ ఇంటర్వ్యూ. ఈ మాట వినడానికి కొత్తగా ఉంది. ఏమిలేదు.. రిలీజ్ కి దగ్గరగా ఉన్న రెండు సినిమాల హీరోలు కలిసి పరస్పరం ఇంటర్వ్యూ చేసుకుంటారు. తమ సినిమాలకు సంబంధించిన విశేషాలను షేర్ చేసుకుంటారు. దీనినే క్రాస్ ప్రమోషన్స్ అని పిలుస్తారు.

ఇటీవలే దేవర సినిమా విషయంలో ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు మేకర్స్. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్, తారక్ కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇలా ఇద్దరు తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. సెప్టెంబర్  27న దేవర రిలీజ్ కానుంది. అలానే అక్టోబర్  11న జిగ్రా సినిమాతో అలియాభట్ రానుంది.  ఈ రెండు సినిమాలకు కలిపి ఒకే ఇంటర్వ్యూ చేశారు. ఇలా తారక్, అలియా భట్ ఒక్కేసారి ఇద్దరి సినిమాలను ప్రమోట్ చేసుకున్నారు. అదే విధంగా వారం గ్యాప్ లో శ్వాగ్, జనక అయితే గనక అనే సినిమాలు విడుదల కానున్నాయి. శ్వాగ్ లో శ్రీ విష్ణు, జనక అయితే గనక సినిమాలో సుహాస్ హీరోలుగా నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాలకు కూడా క్రాస్ ప్రమోషనే చేశారు. ఈ ఇద్దరు హీరోలు కలసి ఇంటర్వ్యూ చేశారు. అక్టోబర్ 4న శ్వాగ్ రానుండగా, అక్టోబర్ 12న జనక అయితే గనక సినిమా రిలీజ్ కానుంది. గతేడాది కూడా ఇలాంటి ప్రమోషన్లు కనిపించాయి. లాస్ట్ ఇయర్ దసరా, రావణాసుర సినిమాలు వారం గ్యాప్ లో వచ్చాయి. ఆ సందర్భంలో నాని, రవితేజలు కూడా ఈ క్రాస్ ప్రమోషన్ ను చేశారు. అలానే ఎజెంట్, కస్టడీ సినిమాల ప్రమోషన్లకు అఖిల్, నాగ చైతన్య ఈ తరహా ప్రమోషన్ చేశారు. ఈ మధ్య ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ అవుతుంది. టైమ్ సేవ్ తో పాటు..ఒక్కేసారి రెండు సినిమాలకు ప్రమోషన్ జరిగిటన్లు అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి..టాలీవుడ్ లో ఉన్న ఈ కొత్త ప్రమోషనల్ స్ట్రాటజీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.