iDreamPost
android-app
ios-app

సలార్ రెండో ట్రైలర్ పై క్రేజీ అప్డేట్..!

  • Published Dec 07, 2023 | 6:13 PM Updated Updated Dec 07, 2023 | 6:13 PM

ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతోంది ప్రభాస్, ప్రశాంత్ నీల్ మూవీ సలార్-ది సీజ్ ఫైర్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై అంచనాలు పెంచేశాయి. డార్లింగ్ ప్రభాస్ ను సరికొత్తగా చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో..

ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతోంది ప్రభాస్, ప్రశాంత్ నీల్ మూవీ సలార్-ది సీజ్ ఫైర్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై అంచనాలు పెంచేశాయి. డార్లింగ్ ప్రభాస్ ను సరికొత్తగా చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో..

  • Published Dec 07, 2023 | 6:13 PMUpdated Dec 07, 2023 | 6:13 PM
సలార్ రెండో ట్రైలర్ పై క్రేజీ అప్డేట్..!

ఈ మధ్య కాలంలో మోస్ట్ వెయిటెడ్ మూవీగా నిలిచిపోయింది సలార్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ తొలి భాగం షూటింగ్ పూర్తయ్యి విడుదలకు రెడీగా ఉంది. అయితే పలుమార్లు వాయిదా పడ్డా.. డిసెంబర్ 22న రావడం పక్కా అని కన్ఫమ్ చేసేసింది చిత్ర యూనిట్. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్. ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్ ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. ఈ డైనో‌సర్‌ను న్యూ లుక్‌లో చూసి డార్లింగ్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ప్రభాస్ ఊర మాసిజాన్ని చూడబోతున్నామన్న ఆనందలో ఉన్నారు. ఈ ట్రైలర్ సినిమాలపై అంచనాలు పెంచితే.. ఇదే కాదూ.. మరో ట్రైలర్ కూడా ఉండబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

కేజీఎఫ్ సిరీస్‌ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నుండి వస్తోన్న మూవీ సలార్ ది సీజ్ ఫైర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకాలు పెట్టుకున్నారు. రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల డిజాస్టర్ల తర్వాత డార్లింగ్ నుండి రాబోతున్న ఈ మూవీ హిట్ అభిమానులకే కాదూ.. ప్రభాస్ కెరీర్‌కు చాలా కీలకం. అయితే ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ చూసి.. బాక్సాఫీసు వద్ద రికార్డులు ఖాయమని ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ నెలకొంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. రెండవ ట్రైలర్‌‌లో షాకింగ్ ఎలిమెంట్స్ చూపించబోతున్నాడట దర్శకుడు. తొలి ట్రైలర్‌లో దేవా అనే యువకుడు తన స్నేహితుడి కోసం ఏదైనా చేయగలిగే వ్యక్తిగా చూపించారు.

అయితే ఈ రెండో ట్రైలర్‌లో సలార్‌గా ప్రభాస్ మారే వర్షన్ ను చూపించనున్నట్లు తెలుస్తోంది. దేవా నుండి సలార్‌గా డార్లింగ్ ఎలా మారాడు అనేది ఉండనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తొలి ట్రైలర్‌లో సగం నుండి వీడియో నుండి ప్రభాస్ ను చూసి పూనకాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు విడుదలయ్యే ట్రైలర్ మొత్తం ఈ కటౌట్ నే చూపించబోతున్నారని తెలుస్తోంది. మరీ అభిమానులు ఈ వీడియోను చూస్తే ఏమైపోతారో. ఈ ట్రైలర్ డిసెంబర్ 16న విడుదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడనేది ఆ మూవీ యూనిట్ రివీల్ చేయలేదు. ఈ మూవీలో శృతిహాసన్, పృథ్వీరాజ్, జగపతి బాబు కీలక పాత్రధారులు. మరీ నెక్ట్స్ వీడియోలో ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ ఎలా కనిపిస్తాడని మీరనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet