iDreamPost
android-app
ios-app

Anushka Shetty: అనుష్క కొత్త సినిమాకు షాకింగ్ టైటిల్ !

  • Published Feb 16, 2024 | 7:56 PM Updated Updated Feb 16, 2024 | 7:56 PM

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది.

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Feb 16, 2024 | 7:56 PMUpdated Feb 16, 2024 | 7:56 PM
Anushka Shetty: అనుష్క కొత్త సినిమాకు షాకింగ్ టైటిల్ !

కొన్ని రోజుల నుంచి, దర్శకుడు క్రిష్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కొత్త సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని అధికారికంగా ప్రకటించకపోయినా… అప్పుడే షూటింగ్ సెట్స్ మీదకు తీసుకెళ్ళి ప్రారంభించినట్లు కూడా వార్తలు వచ్చాయి.  మహిళా ప్రాధాన్యత కలిగిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఒక మంచి లేడీ ఓరియంటెడ్ మూవీలో అనుష్క నటిస్తున్నారు అనే వార్త విని అభిమానులు సంతోషించారు. అయితే ఈ సినిమాకి పెట్టిన టైటిల్ వింటే అందరూ షాక్ అవ్వాల్సిందే.

అనుష్క – క్రిష్ కాంబోలో వస్తున్న సినిమాకి శీలవతి అనే పేరు పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ టైటిల్ చూస్తుంటే సినిమా ఎమోషన్స్, డ్రామాతో పాటు వివాదాస్పద అంశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. లేదా ఒక సీరియస్ ఇష్యూ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కామెడీ కూడా అయి ఉండచ్చు. ఏదేమైనా ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చే వరకూ శీలవతి టైటిల్ వెనుక ఉన్న మిస్టరీ వీడదు. ఈ చిత్రంలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇక సినిమా షూటింగ్ కొరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్‌ను నిర్మిస్తున్నారు. అంతే కాక రెండవ షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది.

తెలుగు చిత్రసీమలో ప్రముఖ దర్శకుల్లో క్రిష్ ఒకరు. కానీ, ఆయన చాలా కాలం పాటు హరి హర వీర మల్లు సినిమా మీదే పని చేస్తూ ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే సమయాన్ని వృథా చేయకుండా అనుష్క శెట్టితో కొత్త సినిమాని తెరకెక్కించడానికి సిద్ధం అయ్యారు క్రిష్. ఈ సినిమా పూర్తయ్యే లోపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు కూడా జరుగుతాయి. ఆ తరువాత క్రిష్ మళ్లీ పవన్ తో కలిసి హరి హర వీర మల్లు సినిమాకు పని చేస్తారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş