iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో చిన్నారి క్రేజీ హీరోయిన్నే.. కానీ టైర్ 1 హీరోలకు దూరం

  • Published Feb 22, 2024 | 3:29 PM Updated Updated Feb 22, 2024 | 4:42 PM

ఈ ఫోటోలో మైక్ పట్టుకుని పాట పాడుతున్న ఈ పాపను గుర్తు పట్టారా.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. సుమారు అర డజనుకు పైగా సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇటు తమిళం, తెలుగు, అటు హిందీ చిత్రాలతో బిజీగా మారిపోయింది.. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

ఈ ఫోటోలో మైక్ పట్టుకుని పాట పాడుతున్న ఈ పాపను గుర్తు పట్టారా.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. సుమారు అర డజనుకు పైగా సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇటు తమిళం, తెలుగు, అటు హిందీ చిత్రాలతో బిజీగా మారిపోయింది.. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

  • Published Feb 22, 2024 | 3:29 PMUpdated Feb 22, 2024 | 4:42 PM
ఈ ఫోటోలో చిన్నారి క్రేజీ హీరోయిన్నే.. కానీ టైర్ 1 హీరోలకు దూరం

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిరూపించుకున్నాక.. ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో జతకట్టే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు నటీమణులు. ఒక్క స్టార్ హీరో పక్కన జతకట్టిన చాలు.. ఓ కిక్కే వేరు ఉంటుంది హీరోయిన్లకు. ఆ తర్వాత టైర్ ఎ హీరోలతో ఛాన్సులు కొల్లగొడితే.. రెమ్యునరేషన్ పెరుగుతుంది. ఇక్కడ రెండు మూడు హిట్లు పడగానే.. బాలీవుడ్ పిలుస్తూ ఉంటుంది. వెంటనే బాలీవుడ్ బాట పట్టొచ్చు. రెమ్యునరేషన్ మరింత పెరగడంతో పాటు, నేమ్, ఫేమ్ ఏక కాలంలో వస్తుంటాయి. అలాగే యాడ్స్ రూపంలో రెండు చేతులా సంపాదించే ఛాన్సు లభిస్తుంది. దీంతో వారు ఊహించిన లైఫ్ సెట్ అయినట్లు అవుతుంది. కానీ మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం.. స్టార్ డమ్ తెచ్చుకుంది.. కానీ ఓ లోటు మిగిలిపోయింది.

ఇదిగో ఈ ఫోటోలో మైక్ పట్టుకుని పాటలు పాడుతున్న చిన్నారిని చూశారు కదా.. ఎవరో గుర్తు పట్టగలరా..ఆమె స్టార్ హీరోయిన్నే.. కానీ టాప్ హీరోలతో జతకట్టలేకపోయింది. మోస్ట్ వాంటెడ్ హీరో సరసన చేసిందీ కానీ.. అందులో కూడా సింగిల్ హీరోయిన్ కాదూ.. ఆమె ప్లేస్‌ను మరొకరితో పంచుకోవాల్సి వచ్చింది. పోనీ అమ్మడులో అందం, నటన తక్కువ అంటే.. అదీ కాదూ.. మంచి ఫెర్ఫ్మామర్. హైట్ కు తగ్గ వెయిట్.. బ్యూటీ అంతా ఓ చోటే రాశి పోసినట్లు ఉంటుంది. కానీ ఎక్కడో చిన్న వెలితి మాత్రం ఉండిపోతుంది. స్టార్ డమ్ ఉన్నప్పటికీ.. తెలుగు టైర్ ఎ హీరోలతో జతకట్టలేకపోతుంది. ఇంతకు ఆమె ఎవరంటే.. మన క్యూటీ రాశి ఖన్నా.

మద్రాస్ కేఫ్ అనే హిందీ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ.. ఊసలు గుసగుసలాడే మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. కానీ ఆమె గల్లీ గల్లీ తెలిసిలా చేసిన మూవీ మాత్రం సుప్రీం. బెల్లం శ్రీదేవికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది రాశి. గోపిచంద్, రవితేజ, వరుణ్ తేజ్, నాగ చైతన్య, సాయి తేజ్, గోపిచంద్, రామ్, విజయ్ దేవర కొండ వంటి టైర్ 2 హీరోలతో చేసింది. జై లవ కుశలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆడిపాడింది. అయితే మరో హీరోయిన్ నివేదితా థామస్ కూడా నటించింది. అటు తమిళం, మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్తా చాటింది. 2022లో వచ్చిన ధనుష్ సరసన తిరు, కార్తీ సర్దార్ మూవీస్‌లో నటించింది. హిందీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి..రుద్ర, ఫర్జీ అనే ఓటీటీ మూవీస్‌లో యాక్ట్ చేసింది. యోధా, ద సబర్మతి రిపోర్ట్, టీఎంఇ అనే హిందీ మూవీలతో పాటు తెలుసు కదా..మరో రెండు సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అమ్మడు.. పెళ్లి హడావుడిలో మునిగిపోయింది. కజిన్ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş