iDreamPost
android-app
ios-app

జవాన్ కాపీ ట్రోల్స్! అట్లీ ఆ తమిళ సినిమానే మార్చి రాశాడా..?

  • Published Sep 01, 2023 | 3:22 PM Updated Updated Sep 01, 2023 | 3:43 PM
  • Published Sep 01, 2023 | 3:22 PMUpdated Sep 01, 2023 | 3:43 PM
జవాన్ కాపీ ట్రోల్స్! అట్లీ ఆ తమిళ సినిమానే మార్చి రాశాడా..?

ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ కి సంబంధించి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా.. కాపీ ట్రోల్స్ అనేవి ఈ మధ్యకాలంలో మామూలే అయిపోయింది. ఎందుకంటే.. ఇటీవల సినిమాల జానర్స్ కలిస్తే చాలు.. కథలు కూడా సేమ్ అని ప్రచారం చేసేస్తున్నారు జనాలు. ప్రస్తుతం ఇవే కాపీ ట్రోల్స్ బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీపై జరుగుతున్నాయి. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ మూవీ.. గతేడాది తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాకు కాపీలా ఉందంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇంతకీ జవాన్ కథని ఏ సినిమాకి కాపీ అంటున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే..

గతేడాది కార్తీ హీరోగా నటించిన సినిమా సర్దార్. దర్శకుడు పిఎస్ మిత్రన్ రూపొందించిన స్పై యాక్షన్ మూవీలో.. కార్తీ డ్యూయెల్ రోల్ చేశాడు. సర్దార్ లో తండ్రి స్పై.. కొడుకు పోలీస్. తండ్రిని పట్టుకునే క్రమంలో కొడుకు అనుకోని చిక్కుల్లో పడతాడు. అప్పుడు అజ్ఞాతంలో ఉన్న తండ్రి బయటికి వచ్చి.. కొడుకు పోలీస్ ని కాపాడి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ఇప్పుడు జవాన్ కూడా ఇదే లైన్ తో తెరకెక్కిందని అంటున్నారు. జవాన్ లో తండ్రి జవాన్ కాగా.. కొడుకు పోలీస్. తండ్రికి సంబంధించిన కేసుపై ఇన్వెస్టిగేషన్ లో చేస్తూ పోలీస్ చిక్కుల్లో పడటం.. మళ్లీ అతన్ని కాపాడేందుకు తండ్రి జవాన్ రావడం.. ట్రైలర్ లో చూపించిన విజువల్స్ బట్టి.. కథ అలా ఉంది.

Jawan movie copy trolls

అంతేగాక డైలాగ్స్ కూడా కలిశాయని అంటున్నారు. సర్దార్ లో ‘వన్స్ ఏ స్పై ఆల్వేస్ స్పై..’ అనగా.. ఇందులో ఒకసారి జవాన్ అయితే వెయ్యి సార్లు అయినా దేశం కోసం చనిపోవడానికి రెడీగా ఉంటాం అంటూ చెప్పడం ఒకే మాదిరిగా అనిపిస్తుందని ట్రోలర్స్ డైరెక్టర్ అట్లీపై కామెంట్స్ చేస్తున్నారు. మరి దర్శకుడు అట్లీ కథ ఏంటో తెలియాలంటే సెప్టెంబర్ 7 వరకు ఆగాల్సిందే. ఇక జవాన్ లో షారుఖ్ కి జోడిగా దీపికా పదుకొనే, నయనతార నటించారు. విలన్ గా విజయ్ సేతుపతి నటించడం జరిగింది. ఇప్పటికే అనిరుధ్ అందించిన సాంగ్స్.. ట్రైలర్ జవాన్ పై ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాని షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. మరి జవాన్ ట్రోల్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom