ఈ ఏడాది ఇండస్ట్రీలో సూపర్ హైప్ క్రియేట్ చేసుకున్న సౌత్ సినిమాలలో లియో ఒకటి. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా.. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ ఖైదీ, విక్రమ్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశాడు కదా! సో.. లియోపై అంచనాలు ఆటోమేటిక్ గా ఆకాశాన్ని అంటుకున్నాయి. అయితే.. ట్రైలర్ ముందు వరకు ఉన్న హైప్.. ట్రైలర్ వచ్చాక ఎందుకో గానీ ఒక్కసారిగా తగ్గిపోయిందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ట్రైలర్ అంచనాలను అందుకోలేకపోయింది అనేది సమాధానంగా వినిపిస్తుంది.
ఎందుకంటే.. ఖైదీ, విక్రమ్ సినిమాలు చూసాక ఎవరికైనా లోకేష్ నుండి తదుపరి సినిమా వస్తుందంటే.. పక్కాగా LCU లో భాగం అవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ.. లోకేష్ ట్రైలర్ లో ఎక్కడ కూడా సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రస్తావించింది లేదు. దీంతో లియో కూడా మాస్టర్ సినిమాలాగా లోకేష్ నుండి వస్తున్న ఇండిపెండెట్ ఫిల్మ్ అని అందరు అనుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ.. లియో మూవీ హాలీవుడ్ సూపర్ హిట్ “ఎ హిస్టరీ ఆఫ్ వయిలెన్స్” అనే మూవీని పోలి ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. లోకేష్ లియో కోసం ఆ సినిమా నుండి స్ఫూర్తి పొందాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
2005లో వచ్చిన ఆ హాలీవుడ్ మూవీ.. అదే పేరుతో 1997లో విడుదలైన ఓ నవల ఆధారంగా రూపొందించారు. అందులో ఓ హోటల్ యజమాని.. తన హోటల్ లో దొంగతనం చేయడానికి వచ్చిన ఇద్దరు దొంగలను కాల్చి చంపేస్తాడు. ఈ విషయం మీడియా ద్వారా మాఫియాకు తెలిసి.. మాఫియా గ్యాంగ్స్ అన్ని ఇతనిపై, ఫ్యామిలీపై అటాక్ కి దిగుతాయి. అలా టార్గెట్ అయిన హీరో.. తన ఫ్యామిలీ కాపాడుకునే క్రమంలో అసలు గ్యాంగ్ స్టర్ బయటికి వస్తాడు. అందుకే ట్రైలర్ లో ‘వాడు నాలా ఉంటే.. నా ఫ్యామిలీ మీద పడతారు ఏంట్రా’ అని ఓ డైలాగ్ ఉంది. సో.. ఆ గ్యాంగ్ స్టర్ పక్కాగా విజయ్ ని పోలి ఉంటాడని.. ఆ కథనే కాస్త మార్చి లోకేష్ తీసాడని అంటున్నారు. మరి అసలు మ్యాటర్ ఏంటనేది అక్టోబర్ 19న తెలుస్తుంది. కాబట్టి.. లియో ట్రైలర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.