iDreamPost
android-app
ios-app

Kajal Aggarwalకాజల్ మిస్ – కారణం ఇదే

  • Published Apr 25, 2022 | 3:59 PM Updated Updated Apr 25, 2022 | 3:59 PM
  • Published Apr 25, 2022 | 3:59 PMUpdated Apr 25, 2022 | 3:59 PM
Kajal Aggarwalకాజల్ మిస్ – కారణం ఇదే

ఇంకో అయిదు రోజుల్లో మెగాస్టార్ ఆచార్య థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. అంచనాలు స్కై హైలో ఉన్నాయి కానీ ఎందుకో మెగా మూవీకి ఉండాల్సిన రేంజ్ లో బజ్ లేదన్న వాస్తవం సోషల్ మీడియాని చూస్తే అర్థమైపోతుంది. కంటెంట్ మీద మాత్రం టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక టీజర్, ట్రైలర్ తో మొదలుపెట్టి హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎక్కడా కనిపించకపోవడం రకరకాల అనుమానాలు రేకెత్తించింది. ఇంతకీ తను ఉందా లేదా లేక క్యారెక్టర్ ని తగ్గించారా లేక ఇంకేమైనా కారణం ఉందా అంటూ రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ఫైనల్ గా దర్శకుడు కొరటాల శివ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు.

దాని ప్రకారం కాజల్ అగర్వాల్ ఫైనల్ వెర్షన్ లో లేదు. తొలుత సరదాగా సాగుతూ ఆచార్యని ప్రేమలో పడేసే పాత్రగా రాసుకున్నప్పటికీ తర్వాత అది కథలో ఫిట్ అవ్వడం లేదని భావించి పూర్తిగా తీసేశారట. షూట్ చేసిన రెండు మూడు సీన్లు కూడా ఎడిటింగ్ లో ఎగిరిపోయాయి. ఇది తాను చిరంజీవిని కన్విన్స్ చేసి కాజల్ కు చెప్పాకే నిర్ణయం తీసుకున్నానని స్పష్టత ఇచ్చారు. పైగా లాక్ డౌన్ టైంలోనూ దీని మీద పలు దఫాలు చర్చలు జరిగినట్టుగా చెప్పారు. సో ఆచార్యలో చిరంజీవికి హీరోయిన్ లేదని అర్థమైపోయింది. డ్యూయెట్ డాన్సుల పరంగా రెజీనాతో చేసిన ఐటెం సాంగ్ తో సర్దుకోవడం తప్ప ఏమి చేయలేం.

సో కాజల్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. ఇటీవలే తల్లయిన తనకు ఆచార్య సక్సెస్ కానుకగా అవుతుందేమోనని భావించారు కానీ ఇప్పుడది జరగడం లేదు. చేతిలో ఉన్న తక్కువ టైంలో చిరు చరణ్ ఇద్దరూ ప్రమోషన్లలో బిజీ అయ్యారు. బిజినెస్ తదితర వ్యవహారాలు పూర్తయ్యాయి కానీ తెలుగు రాష్ట్రాల నుంచి టికెట్ ధరల పెంపు కోసం అప్లై చేసుకోవడంతో వాటి అనుమతులు వచ్చాక ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతుంది. ఇవాళ సాయంత్రానికి స్టార్ట్ కావొచ్చు. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఆచార్యలో తండ్రి కొడుకుల కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మినిమమ్ ఉన్నా చాలు కలెక్షన్ల వర్షం ఖాయమనే చెప్పొచ్చు

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş