iDreamPost
android-app
ios-app

Movie: సుందరం మాస్టర్‌ ట్రైలర్‌లో ఇవి గుర్తించారా?

  • Published Feb 16, 2024 | 4:57 PM Updated Updated Feb 16, 2024 | 4:57 PM

సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వైవా హర్ష కొత్తగా సినిమాల్లో హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. తాజాగా ఆయన సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తిని కలిగించింది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వైవా హర్ష కొత్తగా సినిమాల్లో హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. తాజాగా ఆయన సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తిని కలిగించింది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

  • Published Feb 16, 2024 | 4:57 PMUpdated Feb 16, 2024 | 4:57 PM
Movie: సుందరం మాస్టర్‌ ట్రైలర్‌లో ఇవి గుర్తించారా?

సినీ ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా మారడం టాలీవుడ్ కి కొత్తేం కాదు. ఇటీవలే చాలామంది కమెడియన్లు సినిమాల్లో మెయిన్ రోల్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. అందులో నటుడు సునిల్, వేణు మాధవ్, సప్తగిరి, బ్రహ్మనందం వంటి చాలామంది కామెడియన్ లు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇలా సినిమాల్లో ప్రేక్షకులను నవ్వించి అలరించే కమెడియన్లు హీరోలుగా తమ టాలెంట్ ను నిరూపించుకొని మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు కొత్తగా మరో కమెడియన్ కూడా సినిమాలో హీరోగా వెండితెర పై అలరించనున్నాడు. ఆయనే కమెడియన్ ‘వైవా హర్ష’. ఈయన ఇటీవలే లీడ్ రోల్ లో నటించిన ఓ సినిమాకు సంబంధించి ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకుల్లో సినిమా పై మంచి ఆసక్తిని రేపింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కమెడియన్ ‘హర్ష చెముడు’ (వైవా హర్ష). ఈ పేరు తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమే. కేవలం ఒక యూట్యూబబర్ గా కెరీర్ ప్రారంభించిన హర్ష.. సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. అయితే ఎప్పుడు సినిమాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఉండి ప్రేక్షకులకు నవ్వులు పూయించే హర్ష ఇప్పుడు సినిమాల్లో మెయొన్ రోల్ గా నటించాడు. ఈయన తాజాగా ‘సుందరం మాస్టర్’ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్  కూడా రిలీజ్ అయింది. దీనిని మెగాస్టార్ ‘చిరంజీవి’ తన చేతుల మీదుగా లాంఛ్ చేశారు. అలాగే, కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. కాగా, ఈ చిత్రానికి ఆ‌‍ర్‌టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా పతాకాలపై హీరో రవితేజ, సుధీర్ కుమార్ నిర్మించారు. ఇక సుందరం మాస్టర్ సినిమాలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద లీడ్ రోల్ ను పోషించారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ చూస్తే చాలా కామెడీగా ఉంటుంది. ఇందులో మొదటగా హర్ష స్టైల్ పంచులు, కౌంటర్లతో మొదలైన ట్రైలర్.. కాసేపటికే ఎమోషనల్‌గా మారింది. అలాగే హర్ష ఒక గూడెంలోని ప్రజలకు ఇంగ్లీష్ నేర్పించడానికి సుందరం మాస్టర్ గా వెళ్తాడు . అయితే అక్కడి జనాలు చాలాబాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. ఇదంతా చూసి బుర్ర హీటెక్కిపోయిన సుందరం మాస్టర్‌కి అసలు నిజం అప్పుడే తెలుస్తుంది. తనని అక్కడికి పంపించింది ఆ గూడెంలో ఉన్న ఓ విలువైన వస్తువును కనిపెట్టడానికని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అసలు ఆ విలువైన వస్తువు ఏంటి? ఆ గ్రామంలో ప్రజలు అంత ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు? ఇలా ప్రతిదీ చాలా ఆసక్తిగా అనిపించింది.

ఇక ట్రైలర్ చూస్తుంటే ఫన్‌తో పాటు కాస్త ఎమోషనల్ డ్రామా కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ట్రైలర్ లాంఛ్ సందర్భంగా హర్ష గురించి చిరంజీవి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందులో సుందరం మాస్టర్ ట్రైలర్ తనకు బాగా నచ్చిందని, అలాగే హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా అనిపించిందని తెలిపారు. అలాగే తన టాలెంట్‌ను తాను నమ్ముకుని హర్ష ఈ స్థాయికి వచ్చాడని ప్రశంసించారు. మరి ఎంతో ఆసక్తిగా ఉండే ఈ ట్రైలర్‌పై మీరు కూడా ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss