P Krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లో ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకుంటారు. డైలాగ్ లేకుండా ఎక్స్ ప్రెషన్స్ తో నవ్వించడం ఆయన ప్రత్యేకత.
టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లో ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకుంటారు. డైలాగ్ లేకుండా ఎక్స్ ప్రెషన్స్ తో నవ్వించడం ఆయన ప్రత్యేకత.
P Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హాస్య నటులు వెండితెరపై తమదైన హాస్యాన్ని పండించి కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నారు. పాత తరం హాస్య నటులు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేంది రేలంగి, రాజబాబు, పద్మనాభం ఆ తర్వాత తర్వాత అంతటి హాస్యాన్ని పండించిన వారిలో నవ్వుల రారాజు.. బ్రహ్మానందం అనే చెప్పొచ్చు. దశాబ్దాల పాటు ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్న హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం తెరపై కనిపిస్తే చాలు.. ఆయన హావభావాలు చూస్తే చాలు పగలబడి నవ్వుకుంటారు. చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా ఆయన హాస్యాన్ని ఇష్టపడేవారు కోట్లలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలు చాలా వరకు తగ్గించుకున్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తనకు ఇష్టమైన పాత్రల్లో మాత్రమే నటిస్తున్నారు. షూటింగ్స్ ఎలాగూ లేవు.. తనకు నచ్చిన బొమ్మలు వేసుకుంటూ.. తన ఆత్మకథ రాసుకుంటున్నారు. బ్రహ్మానందం ఆత్మకథ పుస్తక రూపంలో త్వరలో వెలువడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆయన తెరపై కనిపించి ఒక్క ఎక్స్‌ప్రెషన్ ఇస్తే చాలు థియేటర్లో నవ్వులే.. నవ్వులు. వెయ్యి చిత్రాలకు పైగా నటించి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన గొప్ప హాస్య నటుడు బ్రహ్మానందం. ఆయన అసలు పేరు కన్నెగంటి బ్రహ్మానందం. 1956 ఫిబ్రవరి 1వ తేదీ, ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లిలో చాగంటి వారి పాలెం గ్రామంలో జన్మించారు. చదువుకునే రోజుల్లో స్టేజ్ షోలో, మిమిక్రీతో అందరినీ ఆకర్షించేవారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లా అత్తిలో లెక్చర్ గా పనిచేశారు. 1887లో ప్రముఖ దర్శకులు జంద్యాల దర్శకత్వంలో ‘అహ నా పెళ్ళంట’చిత్రంలో అరగుండు, నత్తి మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. వాస్తవానికి బ్రహ్మానందం నటించిన మొదటి చిత్రం శ్రీ తాతావతారం, రెండవ చిత్రం సత్యాగ్రహం, మూడవ చిత్రం అహ నా పెళ్ళంట మూవీలో నటించాడు. కానీ అహ నా పెళ్ళంట చిత్రం ఆయన కెరీర్ ని పూర్తిగా మలుపు తిప్పింది.. అప్పటి నుంచి ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు. ఆయన ఉంటే ఆ సినిమా హీట్ అన్న రేంజ్ కి ఎదిగారు. ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలతో పనిచేశారు బ్రహ్మానందం. హాస్య నటుడుగానే కాకుండా కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. దశాబ్ధాల పాటు హాస్యాన్ని అందించిన నవ్వుల రారాజు కొంతకాలంగా సినిమాలను తగ్గించుకుంటూ వస్తున్నారు.. అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తున్నారు. బ్రహ్మానందం మంచి నటుడు మాత్రమే కాదు.. గొప్ప ఫిలాసఫర్. స్వతహాగా తెలుగు మాస్టార్ కాబట్టి.. ఆయనకు తెలుగు భాషపై మంచి పట్టు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు దొరికిన విరామం ఇప్పుడు తన ఆత్మకథ రాసుకునేందుకు వినియోగించుకుంటున్నారు. తన కెరీర్ ఎలా ప్రారంభం అయ్యింది.. ఇండస్ట్రీలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాయి.. దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో తనకు ఉన్న అనుబంధం, వాళ్లతో ముడిపడిన జ్ఞాపకాలను ఈ పుస్తకం ద్వారా పంచుకోబోతున్నట్లు తెలుస్తుంది. ‘నేను.. మీ బ్రహ్మానందం’ పేరుతో వస్తున్న ఈ పుస్తకాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లకు బ్రహ్మానందం ఒక స్ఫూర్తిగా నిలిచారు.. ఈ పుస్తకం మరెంతోమందికి స్పూర్తి కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.