iDreamPost
android-app
ios-app

Unstoppable 3: క్రేజీ న్యూస్.. అన్ స్టాపబుల్ షోకు CM రేవంత్ రెడ్డి?

  • Published Aug 20, 2024 | 3:51 PM Updated Updated Aug 20, 2024 | 3:51 PM

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తొలి రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ కావడంతో.. మూడో సీజన్ కు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ షోకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తొలి రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ కావడంతో.. మూడో సీజన్ కు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ షోకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 20, 2024 | 3:51 PMUpdated Aug 20, 2024 | 3:51 PM
Unstoppable 3: క్రేజీ న్యూస్.. అన్ స్టాపబుల్ షోకు CM రేవంత్ రెడ్డి?

నందమూరి బాలకృష్ణ.. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఇంకో వైపు టాక్ షోతో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసబెట్టి సినిమాలు చేస్తూనే.. ఇటు పాలిటిక్స్ ను చూసుకుంటున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే.. అన్ స్టాపబుల్ టాక్ షోతో వచ్చిన క్రేజ్ మరో ఎత్తనే చెప్పాలి. తొలి రెండు సీజన్లు ఎంతటి సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు మూడో సీజన్ కోసం రెడీ అవుతున్నారు బాలయ్య. ఇక ఎప్పటిలాగే రాజకీయ, సినీ ప్రముఖులను ఈ షోకు ఆహ్వానించనున్నారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ షోకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లో ఎన్ని టాక్ షోలు ఉన్నా.. అన్ స్టాపబుల్ షోకు ఉన్న క్రేజ్ మాత్రం వేరనే  చెప్పాలి. అంతలా నందమూరి బాలకృష్ణ ఈ షోతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. తొలి రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ కోసం రెడీ అవుతున్నారు. అయితే ఈసారి పాలిటిక్స్ నుంచి బాలయ్య ఎవరిని షోకు తీసుకొస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఈసారి పాలిటిక్స్ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ షోకు రాబోతున్నట్లు సమాచారం.

CM Revanth Reddy for Unstoppable show

కాగా.. సీఎం రేవంత్ రెడ్డికి బాలయ్యకు మంచి సంబంధాలే ఉన్నాయి. అదీకాక ఇటీవలే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఆ అనుబంధంతోనే బాలయ్య పిలిస్తే రేవంత్ కాదనరు అని పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి మీలో ఎంతమంది సీఎం రేవంత్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకు వస్తే చూడాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş