Kangana Ranaut Issue: కంగనాను కొట్టిన కేసులో CISF కానిస్టేబుల్‏కు ఊహించని షాక్.. ఏం జరిగిందంటే?

కంగనాను కొట్టిన కేసులో CISF కానిస్టేబుల్‏కు ఊహించని షాక్.. ఏం జరిగిందంటే?

Kangana Ranaut Issue: గత ఏడాది రైతులు చేసిన నిరసనపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న కారణంతో ప్రముఖ నటి, ఎంపీ కంగనా రౌనత్ ను కుల్విందర్ అనే సీఐఎస్ఎఫ్ అనే మహిళా కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించింది. ఈ సంఘట దేశ వ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసింది.

Kangana Ranaut Issue: గత ఏడాది రైతులు చేసిన నిరసనపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న కారణంతో ప్రముఖ నటి, ఎంపీ కంగనా రౌనత్ ను కుల్విందర్ అనే సీఐఎస్ఎఫ్ అనే మహిళా కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించింది. ఈ సంఘట దేశ వ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి కంగనా నౌనత్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.కంగనా రౌనత్ సినీ ఇండస్ట్రీలో నటిగానే కాకుండా నిర్మాత, దర్శకురాలిగా తన సత్తా చాటారు. ప్రధాని మోదీ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితురాలై బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. కంగనా కొన్ని విషయాల్లో కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం.. అలా ఆ మధ్య రైతులు చేసిన నిరసనలపై ఆమె చేసిన కామెంట్స్ పై కోపంతో కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టుబుల్ చెంప చెల్లుమనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తమ పంటలకు కనీస మద్దతు ధర చెల్లించాలని కోరుతూ దేశ వ్యాప్తంగా అనేక రైతు సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రైతుల నిరసనలపై ప్రముఖ నటి, ఎంపీ కంగనా రౌనత్ అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న కోపంతో కుల్విందన్ అనే సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ గత నెల చండీగఢ్ విమానాశ్రయంలో చెంప చెల్లుమనిపించింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ఫిర్యాదుతో కుల్విందన్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా.. సిట్ దర్యాప్తును పూర్తి చేసి అధికారులకు నివేదిక సమర్పించింది. ఈ ఘటనలో కుల్విందన్ కు సినీ ప్రముఖులు, సామాజిక నేతలు, రైతుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

బాలీవుడ్ మ్యాజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. మరోవైపు తనకు మద్దతు ఇవ్వకపోవడంపై కంగనా రౌనత్ మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. కంగనాపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్ కేసులో కీలక పరిణామాం చోటు చేసుకుంది. కుల్విందర్ కౌర్ కుల్విందర్ పై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై బదిలీ వేటు వేశారు. చండీగఢ్ నుంచి బెంగుళూరు రూరల్ జిల్లా నేలమంగల తాలూకాలో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ కు ట్రాన్స్ వర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె సస్పెన్షన్ లోనే ఉంటగం గమనార్హం.

Show comments