iDreamPost
android-app
ios-app

బెంగళూరు మహిళ హత్య కేసు.. FIRలో సంచలన నిజాలు!

  • Published Sep 24, 2024 | 4:59 PM Updated Updated Sep 24, 2024 | 4:59 PM

Bengaluru Mahalakshmi Case: తాజాగా కర్ణాటకలో ఓ యువతి అత్యంత దారుణంగా 50 ముక్కలుగా నరకబడి.. శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న కొద్దీ విస్తుర పోయే నిజాలు బయటకు వస్తున్నాయి . తాజాగా ఎఫ్ఐఆర్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Bengaluru Mahalakshmi Case: తాజాగా కర్ణాటకలో ఓ యువతి అత్యంత దారుణంగా 50 ముక్కలుగా నరకబడి.. శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న కొద్దీ విస్తుర పోయే నిజాలు బయటకు వస్తున్నాయి . తాజాగా ఎఫ్ఐఆర్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 24, 2024 | 4:59 PMUpdated Sep 24, 2024 | 4:59 PM
బెంగళూరు మహిళ హత్య కేసు.. FIRలో సంచలన నిజాలు!

బెంగుళూరు యువతి హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కోసం ఆరు ప్రత్యేక బృందాలను దించారు పోలీసులు. సినీ లెవెల్ లో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మహాలక్ష్మి అనే 29ఏళ్ల మహిళ మూడు నెలల క్రితం బెంగుళూరు కు వచ్చింది. ఆమెకు భర్తతో గొడవలు కావడంతో భర్త నుంచి దూరంగా ఉంటుంది. అయితే ఉన్నట్లుండి ఓ రోజు ఆ మహిళ ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు ఈ విషయాన్నీ పోలీసులకు తెలియజేశారు. అప్పుడే అందరు నివ్వెర పోయే నిజం తెలిసిందే. ఆ మహిళను అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టారు. తలను పక్కనే సూట్ కేసులో పెట్టారు. దీనితో ఈ ఘటన పై వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఎఫ్ఐఆర్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దాదాపు 50 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన మహాలక్ష్మి.. శరీర భాగాలను పోలీసులు సేకరించారు. అనంతరం వాటిని అన్ని అమర్చి.. అందులోని ప్రేగు భాగం , కడుపు భాగానికి వైద్య పరీక్షకు పంపించారు. విషం ఇచ్చి ఈ హత్య చేశాడా లేదా ఇంకా ఏ రకంగా మహాలక్ష్మి హత్య చేయబడింది అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శరీరంలో విషయం ఉందో లేదో తెలియడానికి కనీసం ఇంకా కొద్దీ రోజుల సమయం పడుతుందని తెలియజేశారు. దీనితో ఈ కేసు విషయంలో తల్లి ఇచ్చిన పిర్యాదుపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే స్థానికులు సమాచారం ప్రకారం మహాలక్ష్మిని తరచూ ఓ యువకుడు కలుస్తూ ఉండేవాడని.. ప్రతి రోజు ఉదయం , సాయంత్రం ఇంటి దగ్గర దించి వెళ్లే వాడని చెప్పారు. ఇక ఈ హత్య కూడా నాలుగైదు రోజుల క్రిందటే జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు.

అలాగే పోలీసులు… మహాలక్ష్మి తల్లిని , భర్తను కూడా విచారించారు. ఇలా ఆమెకు సంబంధం ఉన్న ప్రతి వ్యక్తిని విచారిస్తూ.. వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇప్పటివరకు అయితే ఈ హత్యను ఎవరు చేశారు అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే ఇంత దారుణంగా హత్య చేయడం వెనుక దాగి ఉన్న కారణాలు కూడా తెలియాల్సి ఉంది. ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకుందా ? లేదా భర్తతో విడిపోయిన కారణంగా అతనే ఈ హత్య చేయించాడా ? లేదా రోజు ఆమెను కలిసే ఆ యువకుడు ఆమెను వేధించాడా ? అసలు ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారా ? ఇలా ఈ కేసు విషయంలో రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా రోజు రోజుకి ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. మరి ఈ కేసులో రానున్న రోజుల్లో ఎలాంటి నిజాలు భయటపడతాయో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetJojobetMadridbetMadridbetgrandpashabetgrandpashabet girişJojobetcasibomgrandpashabetjojobetcasinomilyoncasinomilyonultrabetultrabetgrandpashabet girişcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel giriş