iDreamPost
android-app
ios-app

నీట మునిగిన బెంగుళూరు.. విద్యాసంస్థలకు సెలవులు!

  • Published Oct 16, 2024 | 1:32 PM Updated Updated Oct 16, 2024 | 1:32 PM

Bengaluru Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి తీరం వైపు తరుముకొస్తుంది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుదుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల బెంగుళూరులో వర్షాలు దంచికొడుతున్నాయి.

Bengaluru Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి తీరం వైపు తరుముకొస్తుంది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుదుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల బెంగుళూరులో వర్షాలు దంచికొడుతున్నాయి.

నీట మునిగిన బెంగుళూరు.. విద్యాసంస్థలకు సెలవులు!

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు దంచికొడుతున్నాయి.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లు, ఫ్లైట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.బలమైన ఈదరు గాలులకు అనేక ప్రాంతాల్లో చెట్టు కూలడం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశంలో అతిపెద్ద ఐటీ హబ్ అయిన మాన్యత టెక్ పార్క్ నీట మునిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల బెంగుళూరులో వాతావరణ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఆ మధ్య వర్షం చుక్క లేక నీటి ఎద్దడితో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు భారీ వర్షంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గత రెండు రోజులుగా బెంగుళూరులో కురుస్తున్న కుండపోత వర్షంతో రోడ్లపై వరద నీరు ఏరులైపారతుంది.నాగావర ఫ్లైఓవర్ వర్షం కారణంగా పూర్తిగా జలమయం అయ్యింది. మాన్యతా టెక్ పార్క్‌లోని చాలా కంపెనీలు నీటితో నిండిపోయాయి. ఆర్‌జీ‌ఏ టెక్ పార్క్ సమీపంలోని జంక్షన్, సర్జాపూర్ రోడ్డులోని విప్రో గేట్, ఐటీపీఎల్ లోని హుడీ, ఎలక్ట్రానిక్స్ సిటీలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా వరద ముంపులో ఉన్నాయి. వర్షం ప్రభావం తగ్గే వరకు ఉద్యోగుల సేఫ్టీ కోసం పలు కంపెనీలు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హూం‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు.అలాగే విద్యాసంస్థలకు సెలువు ప్రకటివంచారు డిప్యూటీ కమిషనర్. కాకపోతే కాలేజ్ తెరిచి ఉంటాయని తెలిపారు.

భారీ వర్షం కారణంగా బుధవారం ఉదయం 8 గంటల వరకు చౌడేశ్వరిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 89.50 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. హెచ్ఏఎల్ ఎయిర్ పోర్ట్ వద్ద 88, విద్యారణ్యపుర వద్ద 80.50, జక్కూరు – 75.50, రాజమహల్ గుట్టహళ్లి- 68.50, హురమావు- 2 వద్ద 67.50, దొడ్డనెక్కుండి – 67, పులకేశనగర్ – 62.50 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమెదైనట్లు అదికారులు తెలిపారు. బెంగుళూరులో పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బెంగుళూరు అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలనని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పనులు అయితేనే బయటకు రావాలని, గర్బిణులు, వృద్దులు, చిన్న పిల్లలు వర్షాలకు బయటకు రాకుండా ఉంటే మంచిదని భారత వాతావరణ శాఖ సూచించింది.