iDreamPost
android-app
ios-app

ఒక్క మూవీకి 595 కోట్లు! ‘కల్కి’ బడ్జెట్​ను మించిపోయిన దర్శకుడి రెమ్యూనరేషన్

  • Published Mar 09, 2024 | 2:55 PM Updated Updated Mar 09, 2024 | 4:17 PM

ఈ రోజుల్లో యాక్టర్స్​తో పాటు డైరెక్టర్స్​ కూడా భారీగా రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు. అయితే ఆ దర్శకుడు మాత్రం రికార్డు స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు. ఆయనకు ఇచ్చే డబ్బులతో చిన్న సినిమాలు ఈజీగా ఓ 50 వరకు తీసేయొచ్చు.

ఈ రోజుల్లో యాక్టర్స్​తో పాటు డైరెక్టర్స్​ కూడా భారీగా రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు. అయితే ఆ దర్శకుడు మాత్రం రికార్డు స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు. ఆయనకు ఇచ్చే డబ్బులతో చిన్న సినిమాలు ఈజీగా ఓ 50 వరకు తీసేయొచ్చు.

  • Published Mar 09, 2024 | 2:55 PMUpdated Mar 09, 2024 | 4:17 PM
ఒక్క మూవీకి 595 కోట్లు! ‘కల్కి’ బడ్జెట్​ను మించిపోయిన దర్శకుడి రెమ్యూనరేషన్

ఈ రోజుల్లో యాక్టర్సే కాదు.. డైరెక్టర్స్, ఇతర టెక్నీషియన్స్ కూడా భారీగా రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా దర్శకులకు హీరో, హీరోయిన్లతో సమానంగా కొన్నిసార్లు పాపులారిటీని బట్టి వారి కంటే అత్యధిక పారితోషికం కూడా అందుతోంది. అయితే ఏదేమైనా ఆ నంబర్ అనేది కొన్ని కోట్ల లోపే ఉంటోంది. వందలకు వందల కోట్లు అందుకోవడం మన దగ్గర పాజిబుల్ కాదు. హాలీవుడ్​లోనూ ఏ ఒకరిద్దరికో మాత్రమే ఆ స్థాయిలో డబ్బుల్ని ముట్టజెబుతారు. అక్కడ ఫిల్మ్ మేకర్స్​ లాభాల్లో వాటా తీసుకోవడం కామన్. అలా వాటా తీసుకోవడం ద్వారా స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తాజాగా వార్తల్లో నిలిచారు. ‘ఇంటర్​స్టెల్లార్’, ‘డన్​కిర్క్’, ‘ది డార్క్ నైట్’ లాంటి బ్లాక్​బస్టర్స్ తీసిన ఆయన గతేడాది ‘ఓపెన్​హైమర్’తో ఆడియెన్స్​ను మరోమారు పలకరించారు. ఈ సినిమా ద్వారా ఆయనకు అందిన మొత్తం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఏకంగా ప్రభాస్ ‘కల్కి’ బడ్జెట్​ను మించిపోయేలా నోలన్ పారితోషికం ఉండటం గమనార్హం.

గతేడాది బాక్సాఫీస్ వద్దకు వచ్చిన ‘ఓపెన్​హైమర్’ సూపర్​హిట్​గా నిలిచింది. దాదాపుగా 100 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం 900 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్​ను షేక్ చేసింది. అలాగే నిర్మాతలకు దండిగా లాభాలను తీసుకొచ్చింది. 2023లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో మూడో ప్లేసులో నిలిచింది ‘ఓపెన్​హైమర్’. వార్ బ్యాక్​డ్రాప్​లో రూపొందిన మూవీస్​లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగానూ మరో రికార్డు సృష్టించింది. ఈ ఫిల్మ్​ను డైరెక్ట్ చేసినందుకు గానూ క్రిస్టోఫర్ నోలన్​కు ఏకంగా 72 మిలియన్ డాలర్స్ రెమ్యూనరేషన్ అందిందని సమాచారం. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.595 కోట్లు అన్నమాట. ‘ఓపెన్​హైమర్’కు వచ్చిన గ్రాస్ కలెక్షన్స్​లో 15 శాతం డబ్బుల్ని పారితోషికం కింద తీసుకునేందుకు నోలన్ ముందే అగ్రిమెంట్ చేసుకున్నారట.

ఆ ఒప్పందం ప్రకారం నోలన్​కు రూ.595 కోట్లు అందాయని హాలీవుడ్ టాక్. తమ పరిశ్రమలో ఒక దర్శకుడికి చెల్లించిన మొత్తాల్లో ఇదే అత్యధికం అని అక్కడి మీడియా కూడా అంటోంది. బాక్సాఫీస్ కలెక్షన్స్​తో పాటు హోమ్ వీడియో సేలింగ్, స్ట్రీమింగ్ విండో లైసెన్స్.. నోలన్​తో పాటు తన ఏజెంట్, అడ్వకేట్​కు చెల్లించిన ఫీజులు, ప్రీ టాక్స్ వంటివన్నీ లెక్కిస్తే దర్శకుడి పారితోషికం సుమారుగా 85 మిలియన్ డాలర్ల గ్రాస్ అని తెలుస్తోంది. ఇందులో అన్నీ పోనూ చివరికి 72 మిలియన్ డాలర్లు నోలన్ చేతికి వచ్చాయని టాక్. ఇలా చూస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ బడ్జెట్ అంతా కలిపితే నోలన్ రెమ్యూనరేషన్ అంత ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ‘కల్కి’ బడ్జెట్ సుమారుగా రూ.600 కోట్లు అని ప్రచారం జరుగుతోంది. మరి.. ‘ఓపెన్​హైమర్’ దర్శకుడి రెమ్యూనరేషన్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బావతో ప్రేమలో పడ్డాను.. శరత్‌ బాబుతో బిడ్డను కనాలనుకున్నాను.. కానీ: జయలలిత