iDreamPost

బావతో ప్రేమలో పడ్డాను.. శరత్‌ బాబుతో బిడ్డను కనాలనుకున్నాను.. కానీ: జయలలిత

Actress Jayalalitha.. బోరింగ్ పాప, దుర్గమ్మగా పేరుగాంచిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత .. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు

Actress Jayalalitha.. బోరింగ్ పాప, దుర్గమ్మగా పేరుగాంచిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత .. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు

బావతో ప్రేమలో పడ్డాను.. శరత్‌ బాబుతో బిడ్డను కనాలనుకున్నాను.. కానీ: జయలలిత

క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి జయ లలిత. పాత తరం వాళ్లకు బోరింగ్ పాపగా.. టీవీ ప్రేక్షకులకు దుర్గమ్మ (గోరంత దీపం)గా గుర్తిండిపోతుంది. తెలుగుతో పాటు కన్నడ,మలయాళ, హిందీ చిత్రాల్లో నటించింది. 1986 నుండి ఇప్పటి వరకు పరిశ్రమలోనే కొనసాగుతున్న జయలలిత.. బాలకృష్ణ లారీ డ్రైవర్ చిత్రంలో.. బోరింగ్ పంప్ ఓనర్‌ ‘బోరింగ్ పాప’గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. జయలలిత కన్నా ఈ పేరుతోనే అప్పట్లో ఫేమస్ అయ్యింది ఈ నటి. లేడీ విలన్‌గా, గ్లామరస్ పాత్రలో మెప్పించిన ఆమె.. మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. లవ్ మ్యారేజ్ చేసుకుని.. అతడి టార్చర్ తట్టుకోలేక పెళ్లైన కొన్నాళ్లకే భర్త నుండి విడిపోయింది. అప్పటి నుండి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న ఆమె.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐడ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకుంది.

పెళ్లి పెటాకులు అయ్యాక, మళ్లీ జీవితంలో ప్రేమలో పడలేదన్న జయలలిత.. తనను రెండో పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్స్ వచ్చినప్పటికీ తిరస్కరించినట్లు చెప్పింది. అన్నపూర్ణమ్మ లాంటి నటీమణులు కూడా మళ్లీ పెళ్లి చేసుకోకపోతే, ఎవరినైనా బిడ్డను తెచ్చి పెంచుకో, వయస్సు అయినప్పుడు ఆసరాగా ఉంటారని సలహా ఇచ్చినప్పటికీ.. తన తోబట్టువుల పిల్లలు ఉన్నారన్న ఉద్దేశంతో అటువంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదన్నారు. ‘మళ్లీ ప్రేమ, పెళ్లి, సంసారం’ వద్దు అనుకున్నాన్నారు. ఈ సందర్భంగా తన మనస్సులో మాట బయట పెట్టారు. దివంగత నటుడు శరత్ బాబు, తన మధ్య రిలేషన్ గురించి ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘మా ఇద్దరిది మనస్సు బంధమే. నేను ఆయన్ను ఇష్టపడ్డాను. ఆయనతోనే చాలా యాత్రలు చేశాను. ఆయన మంచి వ్యక్తి. ఒకరి రూపాయి తినరు. ఒకరికి పెట్టారు. ఆయన ఫ్యామిలీ వరకు ఆయన చూసుకుంటారు. ఆయన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే.. ఇండస్ట్రీ పెద్దలు ఆపారు. పెళ్లి చేసుకుని, ఓ బిడ్డను కనాలని ఇద్దరు ప్లాన్ చేసుకున్నాం. ఒక విషయం చెబితే.. శరత్ బాబు సంవత్సరాలు పాటు ఆలోచిస్తుంటారు. ఒక వంద రకాలుగా ఆలోచించి.. లలిత.. ఇలా వద్దేమో, అలా వద్దేమో, మనల్ని ఎవరినైనా కంటే.. మనం పోతే.. ఆస్తి కోసం వారిని ఏదైనా చేస్తారేమో అని ఆలోచించేవారు. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒక తమ్ముడు నాతో చాలా క్లోజ్‌గా ఉంటారు. మా మధ్యే ఏం జరిగింది ఏంటీ అనేది ఆ తమ్ముడి కుటుంబానికి కొంతే తెలుసు. డీప్‌గా వెళ్లామని తెలియదు’ అని వెల్లడించింది జయలలిత.

శరత్ బాబు మాజీ భార్య రమా ప్రభ.. అతడిపై విమర్శలు చేయగా.. జయలలిత ఆయన మంచి వ్యక్తిగా పేర్కొనడంపై ఎదురైన ప్రశ్నకు ఆమెకు స్పందించిన నటి ‘మనం ఓ వైపే విని.. జడ్జ్ చేయలేం. వాళ్లు కలిసి ఉన్నప్పుడు ఏం జరిగిందో చెప్పలేను.. నా వరకు ఆయన మంచి వ్యక్తి. శరత్ బాబును బావ బావ అని పిలిచేదాన్ని. అక్క రమా ప్రభకు ఏదైనా చేయండి అంటే.. చాలా చేశాను. నేను చేయాల్సింది చేశాను అని చెప్పారు. ఆ సమయంలో గుడులు, గోపురాలు వెళతాను అని ఆయన చెప్పగానే.. నేనొక లేడీ అని ఫీల్ అవ్వకపోతే.. మీరు తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు నన్ను తీసుకెళ్లండి అని చెప్పాను. అలా మా జర్నీ స్టార్ అయ్యింది. లలిత, లలిత అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. అలా క్లోజ్ అయ్యాం.

ఆయన చనిపోయినప్పుడు బాధపడితే..నువ్వు యాత్రలు చేయడానికి నీకొక మంచి గైడ్ దొరికాడు అని చిట్టిబాబు నన్ను ఓదార్చారు. ఆయన పేరు నా ఫోనులో తత్వ మసి అని ఫీడ్ చేసుకున్నా. ఆయనకు సేవ చేసుకొని అలా ఉండిపోవాలనుకున్నా. కానీ రుణం లేదు’ అంటూ కాస్త ఎమోషన్ అయ్యారు. జయలలిత ఇంద్రుడు, చంద్రుడు, అగ్గిరాముడు, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, అక్క మొగుడు, డిటెక్టివ్ నారద, జోకర్, జంబలకిడి పంబ, సిసింద్రీ, గోపి గోపికా, గోదావరి, ఓరీ దేవుడా వంటి చిత్రాల్లో నటించింది. గోరంత దీపం, ముత్యాల ముగ్గు, రాధా గోపాలం, గృహ ప్రవేశం, ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్‌లో నటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి