iDreamPost
android-app
ios-app

నెల్లూరులో జానీ మాస్టర్.. రంగంలోకి పోలీసులు.. ఎందుకంటే ?

  • Published Sep 18, 2024 | 1:38 PM Updated Updated Sep 18, 2024 | 3:20 PM

Choreographer Jani Master Case Latest Update: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అతనిపై పలు కేసులో నమోదు కాగా తాజాగా ఈ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.

Choreographer Jani Master Case Latest Update: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అతనిపై పలు కేసులో నమోదు కాగా తాజాగా ఈ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.

  • Published Sep 18, 2024 | 1:38 PMUpdated Sep 18, 2024 | 3:20 PM
నెల్లూరులో జానీ మాస్టర్.. రంగంలోకి పోలీసులు..  ఎందుకంటే ?

ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసింది. ఆయన వద్ద పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో.. ఈ విషయానికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్ తనపై పలు మార్లు లైంగికంగా దాడికి పాల్పడినట్లు ఆ యువతి కంప్లైంట్ చేసింది. దీనితో వెంటనే స్పందించిన పోలీసులు.. జానీ మాస్టర్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పలువురు ఇండస్ట్రీ పెద్దల మధ్య కూడా దీనికి సంబంధించిన డిస్కషన్ నడుస్తూనే ఉంది. అలాగే సినీ సెలెబ్రిటీలు సైతం ఈ విషయంపై స్పందిస్తున్నారు. అయితే ఈ కేసును ఫాలో చేస్తున్న కొద్దీ.. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనిని విచారించేందుకు నోటీసులు అందచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ హైదరాబాద్ లో లేడని తెలుస్తుంది. అతను నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నార్సింగ్ పోలీసులు.. నెల్లూరు పోలీసులతో సంప్రదింపులు జరిపి.. మొదట నోటీసులు అందచేసి విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ అవ్వడంతో.. జాని మాస్టర్ నెల్లూరులో ఎక్కడ ఉన్నారా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. జానీ మాస్టర్ స్వస్థలం నెల్లూరు కావడంతో.. బంధువుల ఇంట్లోనే ఉండి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇష్యు గురించి తెలుసుకున్న తర్వాత నెటిజన్లు జానీపై మండి పడుతున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. కేసుపై ఆరా తీస్తున్న కొద్దీ పాత విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాను మైనర్ గా ఉన్నప్పటినుంచే జానీ మాస్టర్ ఆమెను వేధిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదు పేర్కొంది. ఇదే విషయం ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా బయటకు తీసుకుని వచ్చింది. అసలు నిజా నిజాలు ఏమై ఉంటాయి అనేది జానీ మాస్టర్ ను కూడా విచారిస్తే కానీ తెలియదు. మరి కొద్దీ రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటపడనున్నాయి. ఏదేమైనా పోలీసులు అన్ని కోణాలలో విశ్లేషించి.. ఈ కేసును సీరియస్ గా తీసుకోవాలంటూ నెటిజన్లు కూడా వాపోతున్నారు. ఏమౌతుందో చూడాలి. మరి జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడంటూ వినిపిస్తున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetgrandpashabet