జానీ మాస్టర్ దగ్గరకు అమ్మాయిని నేనే పంపాను – అనీ మాస్టర్

Jani Master Case New Update: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. కొన్ని రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా మీడియా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అనీ మాస్టర్ సంచలన విషయాలను బయటపెట్టింది . దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇలా ఉన్నాయి.

Jani Master Case New Update: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. కొన్ని రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా మీడియా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అనీ మాస్టర్ సంచలన విషయాలను బయటపెట్టింది . దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు గురించి అందరికి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరకు ఈ విషయం మీడియా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారిస్తున్న కొద్దీ రోజుకో ఒక కొత్త విషయం బయటపడింది. అలాగే ఎన్నో ఆడియో లు కూడా లీక్ అయ్యాయి. ఇక ఆ తర్వాత ఈ కేసు కారణంగా జానీ మాస్టర్ కు రావాల్సిన నేషనల్ అవార్డు ను కూడా క్యాన్సిల్ చేశారు. దీనితో పలువురు కొరియోగ్రాఫర్స్ దీనిపై స్పందించారు. ఇప్పటికీ కూడా ఆ కేసు తేలలేదు. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. మరో వైపు జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు తట్టుకోలేక.. ఆయన తల్లి గుండెపోటుతో హాస్పిటల్ పాలయ్యారు. ఇలా జానీ మాస్టర్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఈ క్రమంలో లేడి కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ ఇన్ని రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించిన ఎన్నో సంచలన విషయాలను బయట పెట్టారు. ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో ఈ వివాదం మరోసారి చర్చలకు దారితీసింది.

తాజాగా అనీ మాస్టర్ జానీ మాస్టర్ కేసు విషయంలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఎవరైతే జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేశారో.. ఆ యువతి తనకు తెలుసంటూ.. అవకాశాల కోసం ఆమెకు తరచూ మెసేజ్ చేసేదంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తానే జానీ మాస్టర్ దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చానని.. జానీ మాస్టర్ తనకు లైఫ్ ఇచ్చాడని తెలియజేశారు. ఇన్నీ రోజులు ఈ విషయాలు చూస్తూ చాలా ఆందోళనకు గురయినట్లు చెప్పారు. గతంలో ఆమె జానీ మాస్టర్ తో కలిసి అనేక సినిమాలు చేశానని.. ఆయన ఎప్పుడు కూడా తప్పుగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు. అలాగే ఆ యువతి ఇన్నేళ్లు ఆయన దగ్గర పని చేసి.. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. అంతే కాకుండా ఎంతో కష్టపడి ఈ స్థాయి వరకు చేరుకున్న వ్యక్తికి.. ఆ అవార్డు రద్దు చేయడం కూడా చాలా బాధగా ఉందని అన్నారు. ఒకవేళ బాధిత యువతికి నిజంగానే అన్యాయం జరిగి ఉంటే మాత్రం.. ఆమెకు మద్దతుగా నిలుస్తానని వెల్లడించారు అనీ మాస్టర్.

అయితే కోర్టు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి.. ఇప్పటికి జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తున్నట్లు వ్యక్తం చేశారు. మొదటి నుంచి  అటు జానీ మాస్టర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే మాట మీద ఉన్నారు. కానీ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం తప్పు ఒప్పుకున్నట్లు తెలిసింది. అప్పటినుంచి జానీ మాస్టర్ పోలీసుల కస్టడీ లోనే ఉన్నారు. మరి కోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఏమౌతుందో చూడాలి. మరి అనీ మాస్టర్ జానీ మాస్టర్ పై స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments