Swetha
Jani Master National Award Cancellation Reason: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇండస్ట్రీలో అందరిని కదిలించింది. ఈ విషయం గురించి రోజుకో వార్తా వింటూనే వస్తున్నాం. కానీ ఇప్పటివరకు కూడా దానికి సంబంధించిన అసలైన నిజాలు బయటపడలేదు. ఈ క్రమంలోనే కోర్టు జానీ మాస్టర్ కు రావాల్సిన నేషనల్ అవార్డ్ కూడా క్యాన్సిల్ అయింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
Jani Master National Award Cancellation Reason: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇండస్ట్రీలో అందరిని కదిలించింది. ఈ విషయం గురించి రోజుకో వార్తా వింటూనే వస్తున్నాం. కానీ ఇప్పటివరకు కూడా దానికి సంబంధించిన అసలైన నిజాలు బయటపడలేదు. ఈ క్రమంలోనే కోర్టు జానీ మాస్టర్ కు రావాల్సిన నేషనల్ అవార్డ్ కూడా క్యాన్సిల్ అయింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
Swetha
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. మీడియా, సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనపై పెట్టిన కేసు.. ఇండస్ట్రీ వర్గాలను కుదిపేసింది. చాలా మంది ఈ విషయంపై స్పందించారు. అయినా జానీ మాత్రం తానూ ఏ తప్పు చేయలేదని నమ్మకంగా చెబుతూనే ఉన్నాడు. ఇలా ఈ కేసులో రోజుకు ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంది. అలాగే కొన్ని ఆడియో క్లిప్స్ కూడా లీక్ అయ్యాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. ఇప్పటికీ అటు పోలీసులకు కానీ ఇటు నెటిజన్లకు కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే రెండు రోజుల క్రితం కోర్టు జానీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే జానీ మాస్టర్ ఓ సినిమాకు గాను బెస్ట్ కొరియోగ్రాఫర్ క్యాటగిరిలో నేషనల్ అవార్డు కు ఎంపిక అయ్యాడు. ఈ నెల 8న ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. కానీ ఈ అవార్డు ను క్యాన్సిల్ చేశారు.
ఈ క్రమంలోనే.. జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్.. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు క్యాన్సిల్.. జానీకి మళ్ళీ జైలు తప్పదా.. జానీ మాస్టర్ అవార్డు పై కుట్ర.. అంటూ ఇలా రకరకాల వార్తలు వింటూ వస్తున్నాం. జానీ మాస్టర్ పైన కక్షతోనే ఎవరో ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు కూడా మొదటి నుంచి వింటూ వస్తున్నాం. ఇక ఇప్పుడు నేషనల్ అవార్డు సైతం క్యాన్సిల్ చేయడంతో.. అందరు దీనిని బలంగా నమ్ముతున్నారు. కానీ నిజానికి నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం వెనుక అసలు కారణం వేరే ఉంది. నేషనల్ అవార్డు అనేది అందరికి దక్కేది కాదు. దాని వెనుక ఎంతో కష్టం , కృషి ఉంటాయి. అలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోవడం చాలా గొప్ప విషయం. కానీ ప్రస్తుతం జానీ మాస్టర్ మీద నమోదు అయినవి పోక్సో , లైంగిక వేధింపుల లాంటి బలమైన కేసులు. ఇవి అంత ఈజీగా తీసిపడేసేవి కాదు. అందుకే ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్న పరిస్థితిలో నేషనల్ అవార్డు ఇవ్వడం కరెక్ట్ కాదని భావించి హోల్డ్ లో పెట్టారు. ఈ కేసులో అసలు విషయం బయటకు వస్తే కానీ.. దీనికి చెక్ పడదు.
ఇక జానీ మాస్టర్ కు ఎలాగూ నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయింది కాబట్టి.. ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలనీ నార్సింగ్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీనిని బట్టి చూస్తే.. జానీ మాస్టర్ మళ్ళీ జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అలాగే జానీ మాస్టర్ కు అవార్డు క్యాన్సిల్ చేయడంపై.. పలువురు సినీ ప్రముఖులు, ఇతర కొరియోగ్రాఫర్స్ జానీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కేసులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.