iDreamPost
android-app
ios-app

జానీ మాస్టర్ కు బెయిల్ తర్వాత పరిస్థితి ఇదేనా..!

  • Published Oct 26, 2024 | 11:18 AM Updated Updated Oct 26, 2024 | 11:18 AM

Choreographer Jani Master Future: ఒక యువతిపై లైంగిక వేధింపుల కారణంగా జానీ మాస్టర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చింది. మరి ఇప్పుడు జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి.. అతని భవిష్యత్తు ఏంటి అని అందరికి అనుమానులు మొదలయ్యాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Choreographer Jani Master Future: ఒక యువతిపై లైంగిక వేధింపుల కారణంగా జానీ మాస్టర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చింది. మరి ఇప్పుడు జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి.. అతని భవిష్యత్తు ఏంటి అని అందరికి అనుమానులు మొదలయ్యాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 26, 2024 | 11:18 AMUpdated Oct 26, 2024 | 11:18 AM
జానీ మాస్టర్ కు బెయిల్ తర్వాత పరిస్థితి ఇదేనా..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. కొద్దీ రోజులు మీడియా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు అసిస్టెంట్ కొరియోగ్రఫర్ ఇచ్చిన కంప్లైంట్ తో.. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. దీనితో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రెండు వారాల పాటు జానీ మాస్టర్ జైలు గోడల మధ్యన ఉన్నాడు. ఈ కేసు విషయంలో నిన్న మొన్నటి వరకు కూడా రకరకాల వార్తలు వినిపించాయి. కానీ నిజా నిజాలు మాత్రం బయటకు రాలేదు. ఈ కేసు కారణంగా జానీ మాస్టర్ కు రావాల్సిన జాతీయ అవార్డు ను సైతం హోల్డ్ లో పెట్టారు. జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే.. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఉన్న నలుగురు మధ్యన గుర్తింపు తెచ్చుకున్న.. ఓ సెలెబ్రిటీకి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. జీవితంలో ఇలాంటి స్టేజ్ రావాలని ఎవరు కోరుకోరు. ముఖ్యంగా బాగా ఫేమ్ ఉన్న సెలెబ్రిటీ అసలు కోరుకోరు. అలాంటి రోజులను జానీ మాస్టర్ చవిచూశాడు.

ఇక ఇప్పుడు అలాంటి బ్యాడ్ ఫేస్ నుంచి జానీ బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఇన్నాళ్లు సంపాదించుకున్న ఫేమ్ ను మళ్ళీ తిరిగి బిల్డ్ చేసుకోవాల్సిందేనా..! ఇకపై జానీ మాస్టర్ కు అవకాశాలు వస్తాయా..! ఇప్పటివరకు చేసినట్లు స్టార్ హీరోలతో కలిసి మళ్ళీ సినిమాలు తీయగలడా..! ఇదివరకులా టెలివిజన్ షోస్ లో సందడి చేయగలడా..! ఇలా అందరికి చాలా ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. గతంలో వచ్చినట్లు వరుస అవకాశాలు వస్తాయా అంటే అంత జోరుగా వస్తాయని చెప్పలేం.. అలా అని రావన్న గ్యారెంటీ కూడా లేదు. ఎందుకంటే ఇలా కోర్టు కేసులు , జైలు గోడలు చవి చూసిన సెలెబ్రిటీలలో జానీ ఏమి మొదటి వ్యక్తి కాదు. అలాంటి వారు ఎంతో మంది ఇప్పటికి గతంలోలానే తమ పనులు తాము చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి పర్సనల్ విషయాలను పట్టించుకోకుండా .. కేవలం టాలెంట్ ను చూసి అవకాశాలిచ్చే వారు చాలా మంది ఉన్నారు. సో ఈ రకంగా చూసుకుంటే మాత్రం జానీ మాస్టర్ కు అవకాశాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు.

ఇక పెద్ద హీరోల విషయానికొస్తే.. రీసెంట్ గా ఓ స్టార్ హీరో జానీ మాస్టర్ కు ఇచ్చిన ఆఫర్ ను వెనక్కు తీసుకున్నట్లు తెలిసింది. అతనిపై కేసు నమోదు చేసిన యువతికి అండగా ఉంటానన్న హామీ కూడా ఇచ్చారనే కథనాలు బయటకు వచ్చాయి. వారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పు పట్టలేం.. ఒకవేళ జానీ మాస్టర్ ను సినిమాలలోకి తీసుకుంటే.. సొసైటీ లో ఉండే మరో బ్యాచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తారేమో.. కోరి కోరి సినిమాను వివాదంలో పెట్టడం దేనికి.. అనే భయాలు , అనుమానాలతో డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ జానీ మాస్టర్ కు ఫేవర్ గా ఉండే హీరోలు మాత్రం.. ఎవరేం అనుకున్నా.. అతని ట్యాలెంట్ చూసి ఛాన్స్ ఇవ్వడం  గ్యారెంటీ.. ఇక ఇప్పటినుంచి జానీ మాస్టర్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş