P Krishna
Jani Master Gets Bail: మొన్నటి వరకు ఇండస్ట్రీలో ప్రముఖులుగా చలామణి అవుతున్న వారు ఇప్పుడు లైంగిక, అత్యాచారణ ఆరోపణలు ఎదుర్కొంటు జైల్లో ఊచలు లెక్కబెడుతన్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒకరు.
Jani Master Gets Bail: మొన్నటి వరకు ఇండస్ట్రీలో ప్రముఖులుగా చలామణి అవుతున్న వారు ఇప్పుడు లైంగిక, అత్యాచారణ ఆరోపణలు ఎదుర్కొంటు జైల్లో ఊచలు లెక్కబెడుతన్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒకరు.
P Krishna
టాలీవుడ్ లో వరుసగా స్టార్ నటులు, ఇతర రంగాలకు చెందిన వారిపై లెంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు జానీ మాస్టర్. ఇటీవల ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన యువతి.. జానీ మాస్టర్ పై లైంగిక, అత్యాచార ఆరోపణలు చేసింది. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం చెంచల్ గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ కు ఐదు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు ఆయన తరుపు న్యాయవాది. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ కి కాస్త ఊరట లభించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ కి ఊరట లభించింది. ఢిల్లీలో నేషనల్ అవార్డు అందుకోవాల్సింది ఉందని.. అందుకు ఐదు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సింది కోర్టును కోరారు . ఈ క్రమంలోనే జానీ మాస్టర్ బెయిల్ పై విచారణ చేసిన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 6 నుంచి 10 వ తేదీ వరకు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. కాగా, తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కించిన తిరుచిత్రంబళం (తిరు) మూవీలో మేఘం కరుకత.. పాటలకు ఉత్తమ కొరియోగ్రఫి అవార్డు ప్రకటించారు. ఈ పాటకు జానీ మాస్టర్ తో పాటు సతీష్ కృష్ణన్ కూడా కంపోజ్ చేయగా.. ఇద్దరూ అవార్డుని అందుకోబోతున్నారు.
ఇదిలా ఉంటే.. సాధారణ బెయిల్ కోసం ఆయన అప్లై చేయగా ఆ పిటీషన్ పై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి ఫోక్సో కోర్టు. జానీ మాస్టర్ దాఖలు చేసిన జనరల్ బెయిల్ పిటీషన్ పై నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ పిటీషన్ లో పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు.