iDreamPost
android-app
ios-app

Konidela Production మెగా ఫ్యామిలీకి అచ్చిరాని ప్రొడక్షన్

  • Published May 03, 2022 | 1:03 PM Updated Updated May 03, 2022 | 1:03 PM
Konidela Production  మెగా ఫ్యామిలీకి అచ్చిరాని ప్రొడక్షన్

ఆచార్య ఫలితం కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తీవ్ర ప్రభావం చూపనుంది. సినిమాకు అసలు నిర్మాత మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి అయినప్పటికీ భాగస్వామ్యం ఉన్నందుకు మెగా సంస్థ మీద అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ మూవీకి ఇంత దారుణంగా రెస్పాన్స్ రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా చోట్ల నెగటివ్ షేర్స్ నమోదు చేయడం తీవ్ర పరిణామం. అది కూడా నాలుగో రోజే కావడం మరీ అన్యాయంగా కనిపిస్తోంది. ఇంతకన్నా డిజాస్టర్లు చూడనివి కాదు. కానీ ఒకప్పుడు చిరు ఫ్లాప్ సినిమా కలెక్షన్లు ఇతర హీరోల హిట్ చిత్రాలతో సమానంగా ఉండేవన్న నానుడి ఇప్పుడిలా రివర్స్ అవుతోంది.

నిజానికి మెగా ఫ్యామిలీ స్వంత నిర్మాణ సంస్థని హ్యాండిల్ చేయడంలో ముందు నుంచి వీకే. అంజనా ప్రొడక్షన్స్ స్థాపించినప్పుడు రుద్రవీణ, త్రినేత్రుడు రూపంలో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది. ముగ్గురు మొనగాళ్లు సైతం యావరేజ్ కంటే పైన నిలవలేకపోయింది. బావగారు బాగున్నారా ఒక్కటే ఊరట కలిగేలా హిట్టు కొట్టింది. తిరిగి ఆరంజ్ తో భారీ డిజాస్టర్ మూటగట్టుకుంది. దీని దెబ్బకు నాగబాబుకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. ఇంక కొణిదెల ప్రొడక్షన్ ను స్థాపించాక రామ్ చరణ్ దాన్ని సరిగా చూసుకోలేకపోతున్నాడు. కారణాలు అనేకం.

ఖైదీ నెంబర్ 150 కమర్షియల్ సక్సెస్ అందుకున్నప్పటికీ దాని ప్రమోషన్ విషయంలో ఆశించిన దూకుడు చూపించని మాట వాస్తవం. అంత భారీ బడ్జెట్ తో చిరు కలల ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డిని నిర్మిస్తే కొంత నష్టం తప్పలేదు. ఇప్పుడు మూడేళ్లు నానబెడుతూ తీసిన ఆచార్య గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పబ్లిసిటీ మరీ దారుణంగా చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానుకు దీన్ని మూసేయమని డిమాండ్ చేస్తున్నారు. చరణ్ ఇతర సినిమాల్లో నటన వల్ల దీని మీద ఫోకస్ పెట్టలేని మాట వాస్తవం. అలాంటప్పుడు బ్యానర్ ని ఆపేసి పూర్తిగా కెరీర్ నిర్మాణం మీద దృష్టి పెడితే బెటర్. కనీసం ఇలాంటి విమర్శలైనా తప్పుతాయి