iDreamPost
android-app
ios-app

క్రేజీ కాంబో.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్?

  • Author Soma Sekhar Updated - 03:59 PM, Fri - 11 August 23
  • Author Soma Sekhar Updated - 03:59 PM, Fri - 11 August 23
క్రేజీ కాంబో.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్?

ఇండస్ట్రీలో ఒక్కో కాంబినేషన్ కు ఒక్కో స్థాయిలో క్రేజ్ ఉంటుంది. రాజమౌళి-ప్రభాస్, బోయపాటి-బాలయ్య, త్రివిక్రమ్-మహేష్ బాబు, త్రివిక్రమ్-బన్నీ, పవన్ కళ్యాణ్ లాంటి ఎన్నో కాంబినేషన్ లకు ప్రత్యేకించి ఫ్యాన్ బేస్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తొలిసారి ఓ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుంది అంటే ఆ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం అలాంటి కాంబినేషనే టాలీవుడ్ లో రాబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ విషయం ఏంటంటే? మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారన్న వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి ఒక ప్రాజెక్ట్ తర్వాత మరోటి ఒకే చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్. అయితే థియేటర్లలో మార్నింగ్ షో నుంచే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది ఈ మూవీ. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ గా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ తన నెక్ట్స్ మూవీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడన్న వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్ లో నిర్మించనున్నారని తెలుస్తోంది. స్టార్ హీరోలకు కామెడీ టచ్ ఇచ్చి సినిమాలను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడిది ప్రత్యేక శైలి. దీంతో మెగాస్టార్ లో కామెడీ టైమింగ్ కు.. అనిల్ రావిపూడి టేకింగ్ తోడైతే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు. అయితే ఈ క్రేజీ కాంబోపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)


ఇదికూడా చదవండి: ‘జైలర్’ బాక్సాఫీస్ ఊచకోత! ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss