iDreamPost
android-app
ios-app

‘జైలర్’ బాక్సాఫీస్ ఊచకోత! ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

  • Author ajaykrishna Updated - 03:47 PM, Fri - 11 August 23
  • Author ajaykrishna Updated - 03:47 PM, Fri - 11 August 23
‘జైలర్’ బాక్సాఫీస్ ఊచకోత! ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ జైలర్ మూవీ.. కలెక్షన్స్ లో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. ముందునుండి భారీ అంచనాలు సెట్ చేసిన జైలర్ ఈ సినిమా.. థియేటర్స్ లో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బీస్ట్, డాక్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. ఇప్పుడీ జైలర్ మూవీని రూపొందించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో ప్రొడ్యూసర్ కళానిధి మారన్.. బిగ్ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. కాగా.. ఈ సినిమాలో రజినీ సరసన రమ్యకృష్ణ, తమన్నా నటించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్.. జైలర్ లో కీలకపాత్రలు పోషించారు.

ఇక మాస్టర్ ది బ్లాస్టర్ అనిరుధ్.. అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో జైలర్.. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో.. వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. చాలా ఏళ్ల తర్వాత రజినీని మాస్ అవతారంలో చూసేసరికి.. థియేటర్స్ లో ఫ్యాన్స్ కి పూనకాలు మొదలైపోయాయి. ఇక ఫస్ట్ డే సూపర్ స్టార్ సినిమా.. సినీ ట్రేడ్ వర్గాల అంచనాలను తారుమారు చేస్తూ.. ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం. ఈ లెక్కన మొదటి వీకెండ్ లోనే జైలర్.. భారీ లాభాల బాట పట్టనుందని అంటున్నారు.

జైలర్ ఫస్ట్ డే కలెక్షన్స్:

  • తమిళనాడు: 29.46 కోట్లు
  • ఏపీ, తెలంగాణ: 12.04 కోట్లు
  • కర్ణాటక: 11.92 కోట్లు
  • కేరళ: 5.38 కోట్లు
  • రెస్టాఫ్ ఇండియా: 4.23 కోట్లు
  • ఓవర్సీస్: 32.75 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 95.78 కోట్లు (గ్రాస్)

ప్రపంచవ్యాప్తంగా జైలర్ మూవీ.. రూ. 124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యింది. అందులో ఫస్ట్ డే 95.78 కోట్లు గ్రాస్ వచ్చేసరికి.. షేర్ సుమారు రూ. 55 కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో రూ. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ కాగా.. ఫస్ట్ డే రూ. 7 కోట్ల షేర్ వసూల్ చేసింది. మరో 6 కోట్లు షేర్ రాబడితే జైలర్ హిట్ అయిపోతుంది. చూడాలి మరి వీకెండ్ లోపల ఎలాంటి మ్యాజిక్ జరగనుందో! జైలర్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom