iDreamPost
android-app
ios-app

లేటెస్ట్ బజ్.. కన్నప్పలో మెగాస్టార్ చిరంజీవి!

  • Author Soma Sekhar Published - 08:12 PM, Sat - 25 November 23

భక్త కన్నప్ప మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం కన్నప్పలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడన్న వార్తే. ఈ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

భక్త కన్నప్ప మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం కన్నప్పలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడన్న వార్తే. ఈ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

  • Author Soma Sekhar Published - 08:12 PM, Sat - 25 November 23
లేటెస్ట్ బజ్.. కన్నప్పలో మెగాస్టార్ చిరంజీవి!

భక్త కన్నప్ప.. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ. మంచు విష్ణు కెరీర్ లో డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండస్ట్రీని మెుత్తం తనవైపు తిప్పుకుంది. రోజురోజుకు కన్నప్ప మూవీపై హైప్ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే. అదీకాక ఈ చిత్రంలో శివ పార్వతులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, లేడీ సూపర్ స్టార్ నయనతారలు నటిస్తున్నారు అన్న వార్తలు కూడా కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం కన్నప్పలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడన్న వార్తే. ఆ వివరాల్లోకి వెళితే..

భక్త కన్నప్ప.. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి భారీ తారాగాణం నటిస్తున్నారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోనే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేయాలన్నది మంచు వారి అబ్బాయి ప్లాన్. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లను చేసుకుని న్యూజిలాండ్ వెళ్లారు మూవీ టీమ్ మెుత్తం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విష్ణుకు గాయం కావడంతో కాస్త బ్రేక్ పడింది.

ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచే కాక.. సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. కాగా.. ఈ సినిమా కోసం మా ప్రాణాలను పనంగా పెడుతున్నా, ఆడియెన్స్ కు ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ ఇస్తామని విష్ణు చెప్పుకొచ్చాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ అందుకు తగ్గట్లుగానే ఉంది. విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే భారీ తారాగాణం ఈ సినిమాలో నటిస్తుండగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మెగాస్టార్ చిరంజీవి చేరినట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

భక్త కన్నప్పలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్ర చేస్తున్నాడట. మోహన్ బాబుకు చిరంజీవికి ఉన్న స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ స్నేహం కారణంగానే కన్నప్ప సినిమాలో చిరు నటించడానికి ఓప్పుకున్నాడని సమాచారం. అయితే ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. వీరిద్దరి మధ్య స్నేహం కారణంగా మెగాస్టార్ నటించే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు సినీ పండితులు. మరి కన్నప్పలో మెగాస్టార్ నటిస్తున్నారు అన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio