Krishna Kowshik
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ డ్రామా మూవీ హిట్లర్. 1997లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా నటించాడు మన చిరు. ఇప్పుడు ఆ ఐదుగురు చెల్లెళ్లు ఎలా ఉన్నారు..? ఏం చేస్తున్నారంటే.?
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ డ్రామా మూవీ హిట్లర్. 1997లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా నటించాడు మన చిరు. ఇప్పుడు ఆ ఐదుగురు చెల్లెళ్లు ఎలా ఉన్నారు..? ఏం చేస్తున్నారంటే.?
Krishna Kowshik
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ హిట్లర్. 1996లో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఇదే పేరుతో సినిమా తీసి హిట్ కొట్టగా.. ఆ కథను తీసుకుని తెలుగులో రీమేక్ చేశారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. ఈ సినిమాకు ప్రముఖ కమెడియన్ ఎల్ బీ శ్రీరామ్ డైలాగ్స్ రాయడం గమనార్హం. అప్పటికే బిగ్ బాస్, రిక్షావోడు రిజాస్టర్లతో ఏడాది గ్యాప్ తీసుకున్న చిరు.. ఈ స్టోరీ నచ్చి నటించేందుకు ఓక చెప్పారు. అలా పట్టాలెక్కిన మూవీ.. 1997లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రంభ హీరోయిన్ కాగా, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపిస్తాడు. మళ్లీ చిరంజీవి కెరీర్‌కు బూస్టప్ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. ఇందులో ఏడుగురు చెల్లెమ్మలకు అన్నగా కనిపిస్తాడు మెగాస్టార్. ముఖ్యంగా ఆయనతో ఉండేది ఐదుగురు చెల్లెళ్లు. ఇప్పుడు ఆ ఐదుగురు చెల్లెమ్మలు ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారో తెలుసా..?
మెగాస్టార్ పెద్ద చెల్లెలు శారద. ఈ క్యారెక్టర్‌లో నటించింది ప్రముఖ నటి అశ్వినీ నంబియార్. తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసి తెలుగు నాట అడుగుపెట్టింది అశ్వినీ అలియాస్ రుద్ర. ఆంటీ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా మెరిసింది. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ చేసింది. అమ్మకానికో అమ్మాయి, కళంకిత సీరియల్స్‌లో ఎన్నో కష్టాలు పడే మహిళగా నటించి.. ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఆ తర్వాత హిట్లర్, పెళ్లి చేసుకుందాం సినిమాలు చేసింది. ఇటు వెండితెర మీద నటిస్తూనే.. బుల్లితెరపై కూడా బిజీగా మారిపోయింది. తెలుగులో పోలీస్ మూవీ తర్వాత కనిపించలేదు. కానీ ఆమె పెళ్లి చేసుకుని సింగపూర్ వెళ్లిపోయి.. ఇటీవల సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సీరియల్స్, షార్ట్ ఫిల్మ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫోటోలు వైరల్ అవుతుంటాయి.
ఇక రెండో చెల్లెలు అమ్ముగా, అన్నపూర్ణగా నటించింది మోహిని. ఈ ఐదుగురు చెల్లెళ్లలో స్టార్ హీరోయిన్ అంటే ఈమెనే. సౌత్ ఇండియా మొత్తం చుట్టేసింది. తెలుగులో బాలకృష్ణతో ఆదిత్య 369, మోహన్ బాబుతో డిటెక్టివ్ నారద, రాజేంద్ర ప్రసాద్‌తో మామా బాగున్నావా, హిట్లర్ చిత్రాల్లో నటించింది. స్టార్లతో యాక్ట్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ భామ.. అమెరికాకు చెందిన ఓ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిలయ్యింది. 2006లో క్రిస్టియానిటీని స్వీకరించిన ఆమె.. దైవ చింతనలో బతుకుతోంది. 2011 నుండి ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఇక మూడో చెల్లెలు పద్మశ్రీ. ఆమె కూడా సీరియల్ నటే. కొన్ని సీరియల్స్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందో వివరాలు తెలియరాలేదు.
ఇక నాలుగో చెల్లెలు గాయత్రి. ఆమె రియల్ నేమ్ కూడా గాయత్రినే.. గాయత్రి శాస్త్రి. మెట్టెల సవ్వడి, దేవత, కళ్యాణి, బంధం, వంటి ధారావాహికలు చేసింది. ఇవే కాదు.. తమిళంలో అజిత్, విజయ్‌లతో నటించింది. ఎన్నో సినిమాలు, సీరియల్స్ చేసిందీ నటి. ప్రస్తుతం ఆమె పలు తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇక ఆఖరు చెల్లెలు సరస్వతి. ఆ పాత్ర పోషించింది మీనా కుమారి. ఈమె కూడా సీరియల్ నటినే. అంతరంగాలు ధారావాహికలో పొగరు బోతుగా నటించింది. అనుబంధం అనే సీరియల్లో కనిపించింది. కేవలం తెలుగే కాదు మలయాళం, తమిళ బుల్లితెరపై అనేక ధారావాహికల్లో నటించింది. తాజాగా ముగిసిన మావారు మాస్టారు సీరియల్లో మెరిసింది. ఇప్పుడు కూడా సీరియల్స్ కంటిన్యూ చేస్తూనే ఉంది.. ఈమె ఇటీవల నాన్నమ్మ కూడా అయిపోయింది. చిరంజీవితో రిక్షావోడు, హిట్లర్, వెంకటేశ్ జయం మనదేరా చిత్రాల్లో యాక్ట్ చేసింది. అలాగే మరో చెల్లిగా నటించిన బేబీ శ్రేష్ట కూడా ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తోంది.