iDreamPost
android-app
ios-app

Chiranjeevi-Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిరంజీవి శుభాకాంక్షలు

  • Published Dec 07, 2023 | 2:36 PMUpdated Dec 07, 2023 | 2:36 PM

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి.. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి.. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

  • Published Dec 07, 2023 | 2:36 PMUpdated Dec 07, 2023 | 2:36 PM
Chiranjeevi-Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిరంజీవి శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి డిసెంబర్ 7, గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళి సై.. రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ ప్రమాణ సమయంలో సభా వేదిక దద్దరిల్లి పోయింది. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. రేవంత్ తో పాటు మరో 11 మంది మంత్రులగా ప్రమాణ స్వీకారం చేశారు.

తెలంగాణ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి.. చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ’’తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో.. మన రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని.. ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఆయనకు ఇవే నా శుభాకాంక్షలు. అలానే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్క ఆయనతో పాటు నూతన కేబినెట్ మెంబర్స్ అందరికి శుభకాంక్షలు‘‘ అంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ నుంచి తెలంగాణ కొత్త ప్రభుత్వానికి శుభకాంక్షలు తెలిపిన మొదటి వ్యక్తి చిరంజీవే. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

నేడు రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి