iDreamPost
android-app
ios-app

Chiranjeevi: చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘బాలయ్యతో అలాంటి సినిమా చేయాలని ఉంది‘

  • Published Sep 02, 2024 | 10:38 AM Updated Updated Sep 02, 2024 | 10:42 AM

Chiranjeevi At Balakrishna 50 Years Celebrations: నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

Chiranjeevi At Balakrishna 50 Years Celebrations: నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Sep 02, 2024 | 10:38 AMUpdated Sep 02, 2024 | 10:42 AM
Chiranjeevi: చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘బాలయ్యతో అలాంటి సినిమా చేయాలని ఉంది‘

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. నందమూరి తారక రామరావు తనయుడిగా పరిశ్రమలోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించింది. ఆదివారం, సెప్టెంబర్ 1న జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖలు తరలి వచ్చారు. బాలకృష్ణ సినిమా జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్యతో అలాంటి సినిమా చేయాలని ఉందంటూ తన మనసులో మాట బయట పెట్టారు. ఆ వివరాలు..

బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గోన్న చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘బాలయ్యబాబు 50 సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది బాలకృష్ణకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుక. బాలయ్య ఇలాంటి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దివంగత నటుడు ఎన్టీఆర్‌కు ప్రజల మదిలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కుమారుడిగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు’’ అంటూ ప్రశంసలు కురిపించారు.

Chiranjeevi

‘‘అభిమానులు గొడవలు పడుతుంటారు. కానీ మా హీరోల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉంటాయో అభిమానులకు తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. దీనివల్ల మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. అలానే నా ఇంద్ర సినిమాకు బాలయ్య నటించిన సమరసింహా రెడ్డి మూవీ ఆదర్శం.. అవకాశం వస్తే బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీలో నటించాలని ఉంది‘‘ అంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక ’’సినిమా పరిశ్రమలో 50 సంవత్సరాల ఈ ప్రయాణం.. ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని దేవుడిని కోరుకుంటున్నాను. మూవీలతో పాటు.. రాజకీయ, వైద్య రంగాలలో ఆయన అందిస్తున్న సేవలు.. న భూతో న భవిష్యత్. మేమంతా ఒక కుటుంబంలాంటి వాళ్లం. అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet