iDreamPost
android-app
ios-app

నటి కస్తూరిపై ఫైర్ అయిన సింగర్ చిన్మయి.. ఆమె చేసింది తప్పంటూ..!

  • Author singhj Published - 05:04 PM, Sat - 15 July 23
  • Author singhj Published - 05:04 PM, Sat - 15 July 23
నటి కస్తూరిపై ఫైర్ అయిన సింగర్ చిన్మయి.. ఆమె చేసింది తప్పంటూ..!

సింగర్ చిన్మయి గురించి తెలియని సినీ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. గాయనిగా ఎన్నో అద్భుతమైన పాటలతో ఆమె ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్​గానూ ఆడియెన్స్​ను అలరించారు. స్టార్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెప్పడం ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. సామ్​కు చిన్మయి వాయిస్ పర్ఫెక్ట్​గా సెట్ అయింది. అయితే ఈమధ్య సమంత తన పాత్రలకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. చిన్మయి మీటూ ఉద్యమంలో బాగా యాక్టివ్​గా ఉన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఎన్నో విషయాలపై స్పందిస్తూ, ప్రశ్నిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాంటి ఆమె తాజాగా ఒక సీనియర్ నటిపై సీరియస్ అయ్యారు.

నటి కస్తూరి శంకర్​పై చిన్మయి సీరియస్ అయ్యారు. ఆమె చేసిన పని ఏమాత్రం కరెక్ట్‌ కాదన్నారు. అసలేం జరిగిందంటే.. కెరీర్ మొదట్లో పలు స్టార్ హీరోలతో నటించి బాగా పాపులర్‌‌ అయ్యారు కస్తూరి శంకర్. అలాంటి ఆమె ఈమధ్య టీవీలోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్ మా ఛానెల్​లో ప్రసారమయ్యే ‘ఇంటింటి గృహలక్ష్మీ’ సీరియల్​లో తులసిగా బుల్లితెరపై ఆమె అలరిస్తున్నారు. అలాంటి కస్తూరి శంకర్ తాజాగా ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైన్​ షాప్​కు వెళ్లి అమ్మాయిలు మద్యం సీసాలు కొనడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు.

అమ్మాయిలు మద్యం తాగాలని.. అస్సలు తగ్గొద్దని, ఇది తప్పు కాదని తన ట్వీట్​లో వ్యంగ్యంగా రాసుకొచ్చారు కస్తూరి శంకర్. మహిళా హక్కుల గురించి ఆలోచించకుండానే అవి తిరిగొస్తున్నాయని ఆమె కామెంట్ చేశారు. ఆమె ట్వీట్​పై సింగర్ చిన్మయి ఫైర్ అయ్యారు. ‘కస్తూరి.. ఇలా నువ్వు షేర్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? నిజాయితీగా చెబుతున్నా.. ఇది ముమ్మాటికీ తప్పు’ అని చిన్మయి ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్స్ చిన్మయిని మెచ్చుకుంటున్నారు. అమ్మాయిలు అయినంత మాత్రాన మద్యం తీసుకోకూడదా? వాళ్ల వీడియోను ఇలా షేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కస్తూరి​పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కోలీవుడ్​లో దుమారం రేపుతున్న ఈ వీడియో వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabethititbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio