iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో చిన్నారి స్టార్ హీరోయిన్! హీరోలు కూడా ఆమె ముందు సరిపోరు!

  • Published Feb 09, 2024 | 3:55 PM Updated Updated Feb 09, 2024 | 3:55 PM

ఈ ఫోటోలో చిన్నారిని చూశారు కదా.. ఎవరో గుర్తు పట్టగలరా..? ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్. ఆమె యాక్టింగ్ ముందు హీరోలు కూడా సరిపోరు అనిపించేంత ఫెర్మామెన్స్ ఇస్తుంది. ఇంతకు ఆ నటి ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో చిన్నారిని చూశారు కదా.. ఎవరో గుర్తు పట్టగలరా..? ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్. ఆమె యాక్టింగ్ ముందు హీరోలు కూడా సరిపోరు అనిపించేంత ఫెర్మామెన్స్ ఇస్తుంది. ఇంతకు ఆ నటి ఎవరో తెలుసా..?

  • Published Feb 09, 2024 | 3:55 PMUpdated Feb 09, 2024 | 3:55 PM
ఈ ఫోటోలో చిన్నారి స్టార్ హీరోయిన్! హీరోలు కూడా ఆమె ముందు సరిపోరు!

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. కొంత మంది మాత్రమే సంథింగ్ స్పెషల్‌గా నిలుస్తారు. టైం, పంక్చువాలిటీ, టేక్స్ ఎక్కువ తినడకుండా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ల హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటారు. స్వీట్ అండ్ హంబుల్, క్వైట్, ఫ్రెండ్లీ నేచర్ ఉన్న అమ్మాయిలు పరిశ్రమలో చాలా తక్కువ మందే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కాస్త అటు, ఇటు తడబడ్డా.. వాటిని పాఠాలుగా తీసుకుని ముందుకు సాగుతున్నారు కొంత మంది హీరోయిన్స్. సినిమా చేశామా వెళ్లిపోయామా అని కాకుండా.. యూనిట్ సభ్యులతో కలివిడిగా తిరిగే అరుదైన నటీమణుల్లో ఈమె ఒకరు. టాలీవుడ్ కు దొరికిన ఆ ఆణిముత్యాన్నే మీరు ఈ ఫోటోలో చూస్తుంది.

ఇద్దరు అబ్బాయిలు మధ్యలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో గుర్తు పట్టారా..? తెలుగు పరిశ్రమకు మకుటం లేని మహారాణి. సినిమా కోసం ఏదైనా చేయగల నటి. నెగిటివిటీకి దూరంగా ఉంటూ.. అందరి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎడా పెడా సినిమాలు చేయకుండా.. ఆచి తూచి అడుగులు వేస్తోంది. సినిమా కన్నా వ్యక్తిగత జీవితానికి, స్నేహితులు, కుటుంబ సభ్యులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ.. సగటు ఆడ పిల్లలా ఉంటుంది. నంబరింగ్ గేమ్‌తో.. రన్నింగ్ రేస్‌తో ఆమెకు సంబంధం ఉండదు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో తెలుసా చందనపు సీమ నుండి తెలుగు తెరపైకి వచ్చి సుమగంధాలను వెదజల్లిన క్యూట్ నటి మన స్వీటీ.. అనుష్క శెట్టి. ఈ ఫోటో చిన్నప్పటి స్వీటీది. ఆ ఇద్దరు అబ్బాయిలు ఆమెకు సోదరులు.

యోగా టీచర్‌గా ఆగిపోయి ఉంటే.. టాలీవుడ్ పరిశ్రమ ఓ బ్యూటిఫుల్ హీరోయిన్‌ను కోల్పోయి ఉండేదేమో. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తన నటనతో, నడవడికతో ఆకట్టుకుంటుంది. నటిగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పూరీజగన్నాథ్-నాగార్జున మూవీ సూపర్ మూవీతో టీటౌన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మహానంది, అస్త్రం, విక్రమార్కుడు, లక్ష్యం, డాన్, ఒక్క మగాడు వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆమెను స్టార్ హీరోయిన్ చేసిన చిత్రం అరుంధతి. ఇప్పటికీ చాలా మంది హీరోయిన్లకు అరుంధతి క్యారెక్టర్ డ్రీమ్ రోల్. కానీ ఆ తర్వాత వచ్చిన బిల్లాలో ఆమె బికినీ ధరించడంతో ఫ్యాన్స్ గట్టిగా హర్ట్ అయ్యారు. దీంతో అలాంటి దుస్తులు మళ్లీ వేసుకోకూడదని నిర్ణయించుకుంది. వేదంలో సరోజ రోల్ ఆమెను మరో మెట్టు ఎక్కించింది.

తెలుగులో చేస్తూనే తమిళ నాట కూడా అడుగుపెట్టింది. ఇక మిర్చిలో ఆమె నటనకు ఫిదా కానీ వారుండరు. దీంతో ప్రభాస్‌కు బెస్ట్ జోడీగా ఫిక్స్ అయ్యారు అభిమానులు. బాహుబలితో ఆమె క్రేజ్ వేరే లెవల్‌కు చేరుకుంది. బాహుబలి 2 రాకముందే.. ఓ ప్రయోగం చేసింది. సైజ్ జీరో మూవీ కోసం డైరెక్టర్ కోరాడని ఓవర్ వెయిట్ పెరిగిన నటి ఆమె. ఆ తర్వాత బాహుబలి 2 రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ఫ్యాన్స్ పెరిగారు. ప్రభాస్ కు దీటుగా నటించి.. ఆ క్యారెక్టర్ ఆమె తప్ప మరొకరు చేయలేరని నిరూపించుకుంది. ఆ తర్వాత లేడీ ఓరియంట్ మూవీస్ చేస్తూ పోతుంది. భాగమతి, నిశ్శబ్దం ఓ ఎత్తు అయితే.. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టిలో ఆమె యాక్టింగ్ మరో ఎత్తు. స్టెబుల్ ఫెర్మామెన్స్ ‌తో కిల్ చేసేసింది అంతే. కాగా, ఇప్పుడు క్రిష్ తో ఓ సినిమాతో పాటు మలయాళంలో ఓ ప్రాజెక్టుకు ఓకే చేసినట్లు తెలుస్తోంది. పేరుకు తగ్గట్లు స్వీట్ గా ఉండే అనుష్క మూవీల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet